Super Star Krishna : ఇది చదివితే ఏడవడం గ్యారెంటీ.. కృష్ణ చనిపోయిన 4వ రోజు మహేష్ బాబు అతిపెద్ద నిర్ణయం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Super Star Krishna : ఇది చదివితే ఏడవడం గ్యారెంటీ.. కృష్ణ చనిపోయిన 4వ రోజు మహేష్ బాబు అతిపెద్ద నిర్ణయం !

 Authored By kranthi | The Telugu News | Updated on :18 November 2022,3:40 pm

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ చనిపోయి ఇవాళ్టికి నాలుగు రోజులు. ఆయన చనిపోయి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా ఆయన్ని ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. ముఖ్యంగా కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు అయితే ఇంకా కృష్ణ గురించే ఆలోచిస్తూ ఆయన మెమోరీస్ ను నెమరు వేసుకుంటున్నారు. ఇలా ఆయన ఆకస్మికంగా అందరినీ వదిలి తీరని లోకాలకు వెళ్లడం అందరినీ బాధ కలిగిస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే.. కృష్ణ ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక లెజండ్.

సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. తెలుగు ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది. కొన్ని పేజీలు ఆయన లిఖించుకున్నారు. అందుకే ఆయన గుర్తుగా.. ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడం కోసం కృష్ణ కొడుకు మహేశ్ బాబు ఆయన పేరు మీద ఒక స్మారకాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారట. కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు.. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలను, గుర్తులకు అక్కడ పొందుపరచాలని అనుకుంటున్నారట. కృష్ణ నటించిన సినిమాలకు వివరాలు, ఫోటోలు, అవార్డులు అన్నీ ఆ మెమోరియల్ లో పొందుపరుస్తారట. నిజానికి.. కృష్ణ అంత్యక్రియలు ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించాలని అనుకున్నారు కానీ..

mahesh babu to build memorial to Super Star Krishna

mahesh babu to build memorial to Super Star Krishna

Super Star Krishna :  కృష్ణ కాంస్య విగ్రహంతో స్మారకం

కుదరలేదు. అందుకే ఇప్పుడు కనీసం స్మారకం అయినా ఏర్పాటు చేయాలని కృష్ణ కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ స్మారకాన్ని సామాన్య ప్రజలు, కృష్ణ అభిమానులకు సందర్శించేలా ఏర్పాటు చేయనున్నారు. ఒక్క సారి ఆ మెమోరియల్ దగ్గరికి వెళ్తే కృష్ణకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. పద్మాలయ స్టూడియోలోనే ఈ మెమోరియల్ ను నిర్మించే ఆలోచనను మహేశ్ బాబు చేస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తు తరాలకు కృష్ణ ఎవరో తెలిసేందుకు.. ఆయన ఎంత గొప్ప నటుడో భవిష్యత్తు తరాలు తెలుసుకునేందుకు ఈ మెమోరియల్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంత వీలైతే అంత త్వరగా ఈ మెమోరియల్ ను నిర్మించే అవకాశం ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది