మహేష్ బాబు – అల్లు అర్జున్ మధ్యే మళ్ళీ పోటీ .. ఈసారి మాత్రం అనుకున్నట్టు జరిగే ఛాన్సే లేదు ..?
మహేష్ బాబు – అల్లు అర్జున్ గత ఏడాది ప్రారంభంలోనే తమ సినిమాలతో పోటీ పడ్డారు. 2020 సంక్రాంతి బరిలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో వస్తే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో వచ్చాడు. ఇద్దరి మధ్య భారీ పోటీ నెలకొంది. ఇంతక ముందు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఇలా భారీగా పోటీ పడ్డారు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ రికార్డ్ సాధిస్తే .. మహేష్ బాబు సరిలేరి నీకెవ్వరు సినిమాతో భారీ కమర్షియల్ హిట్ సాధించి బ్లాక్ బస్టర్ కా బాప్ గా నిలిచాడు.
ఇక 2020 లో చెప్పుకోదగ్గ సినిమాలంటే ముందుగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలనే చెప్పుకున్నారు. ఇక అల వైకుంఠపురములో సినిమా లోని సాంగ్స్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అయితే మరోసారి మహేష్ బాబు – అల్లు అర్జున్ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అన్న సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
సర్కారు వారి పాట – పుష్ప సినిమాల మధ్య వార్ ..?
ఈ సినిమా సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నాన్ స్టాప్ గా జరిపే రెండు భారీ షెడ్యూల్స్ తో సర్కారు వారి పాట మేజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెండు సినిమాలు పాన్ ఇండియన్ కేటగిరీలో తెరకెక్కుతున్నాయి. కాగా సర్కారు వారి పాట సినిమాని విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప సినిమాని అదే రోజు రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈసారి బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ ఎవరి సొంతం చేసుకోబోతున్నారో చూడాలి.