Mahesh Rajamouli : మహేష్ రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే.. డేట్ టైం ఫిక్స్ చేశారా..?
ప్రధానాంశాలు:
Mahesh Rajamouli : మహేష్ రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే.. డేట్ టైం ఫిక్స్ చేశారా..?
Mahesh Rajamouli : సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ చేయబోతున్న ఈ సినిమా గురించి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందించనున్న ఈ సినిమా విషయంలో జక్కన్న ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని మార్చేస్తున్నాడు. 28 సినిమాల దాకా మహేష్ చేసిన సినిమాలన్నీ ఒక లెక్క ఐతే ఈ సినిమా మరో లెక్క అనేట్టుగా సూపర్ స్టార్ లుక్ ఉండబోతుంది. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ రేంజ్ కాస్టింగ్ ని టెక్నికల్ టీం ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి సినిమా 2025 ఏప్రిల్ తో మొదలు పెట్టి 2027 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
Mahesh Rajamouli రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్ తోనే..
ఈ సినిమాతో రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడు. సినిమా ఒక విజువల్ వండర్ గా ఆడియన్స్ ని థ్రిల్ కలిగించేలా చేస్తున్నారట. జక్కన్న ఫిక్స్ అయ్యి మరీ అలా చేస్తున్నాడు అంటే సినిమా తప్పకుండా వేరే లెవెల్లో ఉంటుంది. మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమా బడ్జెట్ 1000 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.
రాజమౌళి ఇప్పటివరకు ఓటమి ఎరగని దర్శకుడిగా వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మహేష్ సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం టార్గెట్ చేశాడు. తప్పకుండా ఈ కాంబో సినిమా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందని చెప్పొచ్చు. SSMB29 సినిమా మొదలు పెట్టడం కూడా అదో పెద్ద ఈవెంట్ లా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. తన సినిమాతో తను సృష్టించిన రికార్డులే కాదు అన్ని సంచలనల రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. Mahesh Rajamouli Movie Starts from this Month ,