Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా.. 3 పార్టులా..?
ప్రధానాంశాలు:
Mahesh Rajamouli Movie : మహేష్ రాజమౌళి సినిమా.. 3 పార్టులా..?
Mahesh Rajamouli Movie : సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు. కె లె నారాయణ తో పాటు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నట్టు తెలుస్తుంది. గుంటూరు కారం తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్ ఎవరన్నది చూడాలి. ఐతే ఈ సినిమాకు సంబందించిన వర్క్ షాప్ ని త్వరలో సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా కథ రాసుకున్నప్పుడే మూడు భాగాలు తీసేలా చేస్తున్నారట. మహేష్ రాజమౌళి సినిమా ఒక పార్ట్ గా కాదు కనీసం రెండు భాగాలుగా కాదు ఏకంగా 3 భాగాలుగ్సా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే కథలో 3 భాగాలు కూడా 3 డిఫరెంట్ స్టేజ్ లలో ఆడియన్స్ కు మిరుమిట్లుగొలిపేలా ఉంటాయని తెలుస్తుంది.
Mahesh Rajamouli Movie గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా పెద్ద ప్లాన్..
ఈ సీన్మాకు గ్రాఫిక్స్ విషయంలో కూడా చాలా పెద్ద ప్లాన్ ఉందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్, రాజమౌళి సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తారని తెలుస్తుంది. సినిమా అంతా కూడా భారీ కాన్వాస్ తో రాబోతుంది. తప్పకుండా సినిమా ఊహించుకున్న దాని కన్నా వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఐతే జక్కన్న ప్రస్తుతం సినిమాలో మిగతా కాస్ట్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా కథా నేపథ్యం అంతా కూడా ఆఫ్రికన్ ఫారెస్ట్ అని తెలుస్తుంది. సినిమాలో మహేష్ లుక్ వెరైటీగా ఉండబోతుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ కు ఒక మంచి విజువల్ ట్రీట్ అందించేలా ఉంటుందని తెలుస్తుంది. మహేష్ కూడా ఈ సినిమాకు తన 3 ఏళ్ల డేట్స్ ఇచ్చినట్టు టాక్. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు టెక్నికల్ టీం విషయంలో కూడా రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని తెలుస్తుంది. 3 Parts for Mahesh Rajamouli Movie , Mahesh, Rajamouli, SSMB29, Super Star, Movie