Malla Reddy : మహేష్ బాబును చూసే మంత్రి అయ్యాను.. మల్లారెడ్డి మాటలకు పగలబడి నవ్వినా సూపర్ స్టార్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Malla Reddy : మహేష్ బాబును చూసే మంత్రి అయ్యాను.. మల్లారెడ్డి మాటలకు పగలబడి నవ్వినా సూపర్ స్టార్ ..!

Malla Reddy  : ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి కబీర్ సింగ్ సినిమా చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆయన స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి యాడ్ అయ్యారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘ యానిమల్ ‘ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, […]

 Authored By anusha | The Telugu News | Updated on :28 November 2023,7:58 pm

ప్రధానాంశాలు:

  •  Malla Reddy : మహేష్ బాబును చూసే మంత్రి అయ్యాను..

  •  మల్లారెడ్డి మాటలకు పగలబడి నవ్వినా సూపర్ స్టార్ ..!

Malla Reddy  : ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి కబీర్ సింగ్ సినిమా చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆయన స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి యాడ్ అయ్యారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా ‘ యానిమల్ ‘ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని అన్ని భాషలలో ప్రమోట్ చేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు.

ఇక వీళ్ళతో పాటు మంత్రి మల్లారెడ్డి కూడా గెస్ట్ గా పాల్గొన్నారు. అందరికంటే మంత్రి మల్లారెడ్డి రావడం, ఆయన మాట్లాడడం అందరిని ఆకర్షించింది. స్టేజ్ పైకి ఎక్కి యానిమల్ సినిమాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలాగే మహేష్ బాబు గురించి మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమా గురించి కూడా చెప్పుకొచ్చారు. బిజినెస్ మాన్ సినిమా చూశాకే నేను పాలిటిక్స్ లోకి వచ్చాను. ఈ సినిమా చూసే నేను మంత్రిగా మారాను అని మల్లారెడ్డి అన్నారు. దీంతో అక్కడే ఉన్న మహేష్ బాబు మల్లారెడ్డి మాటలకు నవ్వుకున్నారు. ఈ విధంగా సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్లు హాలీవుడ్ రేంజ్ లో డైరెక్టర్లు కావాలని, అలాగే రాజమౌళి ఇప్పటికే తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ లోకి తీసుకువెళ్లారు అని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో మల్లారెడ్డి స్పీచ్ కి అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నా మల్లారెడ్డి యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

ఇక అర్జున్ రెడ్డి రీమేక్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా ఇది. అమ్మాయిని మనసారా ప్రేమించిన అర్జున్ రెడ్డిని సైకిక్ లవ్ అన్నారు. ఇప్పుడు యానిమల్ సినిమాలో తండ్రి మీద కొడుకు చూపించే ప్రేమ కూడా అలాగే కనిపిస్తుంది అని కొందరు అంటున్నారు. సందీప్ రెడ్డి మార్క్ ప్రేమ ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే ఇటీవల యానిమల్ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ అయింది. ఈ ట్రైలర్ లో మొదటి నుంచి చివరిదాకా తండ్రి కొడుకులతోనే డిజైన్ చేశారు సందీప్ రెడ్డి వంగా. అనిల్ కపూర్ రన్ బీర్ కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలే కాదు, రష్మిక తో ఉన్నవి బాబీ డియోల్ తో కనిపించినవి ఇలా ప్రతి షార్ట్ లోను ఫాదర్ ఎమోషన్ ను డైరెక్టర్ చూపించారు. మరి ఈ సినిమా అర్జున్ రెడ్డి అంతలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కాబోతోంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది