Manchu Lakshmi : ఆ విషయం గుర్తుకు చేస్తే.. గొడ్డలితో నరికేస్తా : మంచు లక్ష్మీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Lakshmi : ఆ విషయం గుర్తుకు చేస్తే.. గొడ్డలితో నరికేస్తా : మంచు లక్ష్మీ

 Authored By bkalyan | The Telugu News | Updated on :14 July 2021,8:10 pm

Manchu Lakshmi : మంచు లక్ష్మీ Manchu Lakshmi సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె వేషభాషలను నెటిజన్లు ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఆమె పలికే పదాలపై వచ్చే మీమ్స్ కోకొల్లలు. అలా మంచు లక్ష్మీ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్రెండింగ్‌లో ఉంటుంది. ఈ మధ్య విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తూ నెట్టింట్లో కాకపుట్టిస్తోంది. లచ్చక్క అందాల ఆరబోతను చూసి అందరూ అవాక్కవుతున్నారు. అలా మంచు లక్ష్మీ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఆమె ఓ ఫోటోను షేర్ చేశారు.

Manchu Lakshmi About Her Vaccation

Manchu Lakshmi About Her Vaccation

Manchu Lakshmi ఆ విషయం గుర్తుకు చేస్తే.. గొడ్డలితో నరికేస్తా : మంచు లక్ష్మీ

అసలే ఈ మధ్య మంచు లక్ష్మీ Manchu Lakshmi బయట వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. అక్కడ ఆమె చేసిన అందాల విందు ఓ రేంజ్‌లో వైరల్ అయింది. మామూలుగా అయితే నిత్యం వెకేషన్‌లకు మంచు లక్ష్మీ వెళ్తూనే ఉంటారు. ఇక ఫ్యామిలీతో కలిసి గత ఏడాది మంచు లక్ష్మీ మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మీ కుటుంబం ఇలా అందరూ కలిసి మాల్దీవుల్లో రచ్చ చేశారు. అక్కడి బీచ్‌లో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేశారు. క్యాంప్ ఫైర్‌లా పెట్టుకుని తెగ ముచ్చట్లు చెప్పుకున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ వెకెషన్ను పూర్తి చేసుకున్నట్టున్నారు.

Manchu Lakshmi About Her Vaccation

Manchu Lakshmi About Her Vaccation

నిన్న రాత్రి మంచు లక్ష్మీ Manchu Lakshmi ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక నేటి ఉదయం నుంచి తన రెగ్యులర్ డ్యూటీ ప్రారంభమైంది. ఉదయాన్ని వర్కవుట్ చేసి, తన కెంతో ఇష్టమైన దోశను టిఫిన్‌లో తినేశారు. అయితే ఇక తాజాగా ఆమె ఓ పోస్ట్ చేసింది. ఇందులో తన గురించి కామెంట్ చేసింది. వెకేషన్‌లో ఉన్నప్పుడు.. టైం అయిపోయింది. ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది.. అని ఎవరైనా గుర్తు చేస్తే ఒళ్లు మండిపోతుంది.. గొడ్డలితో నరికేయాలనిపిస్తుంది.. అనేట్టుగా సింబాలిక్‌గా ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఆమె గొడ్డలి పట్టుకుని ఎవరి మీదో దాడి చేసేందుకు రెడీగా ఉన్నట్టు పోజులు పెట్టేసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> పైన పటారం లోన లొటారం !.. అవినాష్ పరువుతీసేసిన శ్రీముఖి

ఇది కూడా చ‌ద‌వండి ==> టాటూ ఫేక్ కానీ ప్రపోజల్ నిజమే.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూ రెడ్డి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైప‌ర్‌ ఆది, సుధీర్ లు కావ‌చ్చు…!

ఇది కూడా చ‌ద‌వండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది