Jabardasth Auditions : జబర్దస్త్‌లోకి వెళ్లాలనుందా.. ఇలా చేస్తే మీరు హైపర్ ఆది, సుధీర్ లు కావచ్చు…!
Jabardasth Auditions: జబర్దస్త్..ప్రస్తుతం బుల్లితేమీద హైయ్యెస్ట్ రేటింగ్ ఉన్న సక్సెస్ ఫుల్ కామెడీ షో. దాదాపు ఎనిమిదేళ్లుగా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోంది. కెరీర్ ప్రారంభంలో స్కిట్‌లో చిన్న చిన్న వేశాలు వేసిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఈ రోజు స్టార్స్ అయ్యారు. వాళ్ళంటే ఉన్న క్రేజ్ వేరే లెవల్. సినిమాలలోకి వచ్చేందుకు కొత్తవాళ్ళు ఎన్ని కష్టాలు పడేవారో..ఇప్పుడు జబర్దస్త్ లోకి ఎంటరవ్వాలంటే అంత ఠఫ్ గా మారింది. కారణం ఇక్కడ ఉన్న భారీ పోటీనే. అయితే తమలో సత్తా ఉంటే పొట్టి నరేష్ లా క్రేజ్ తెచ్చుకోవచ్చు.సినిమాలలో ఒక కమెడియన్ గా వచ్చి సక్సెస్ అవడం అంటే కత్తిమీద సాములాంటిది.

jabardasth auditions are going on
అలాంటి వాళ్ళకి ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ గొప్ప ప్లాట్ ఫాం లా మారింది. ఈ రోజు బుల్లితెర ను శాసిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్ళు ఈ జబర్దస్త్ షో నుంచి వచ్చి పాపులర్ అయిన వాళ్లే. వీరితో పాటు ఇప్పుడు ఎంతో మంది నటీనటులకు ఇది ఒక వరంలా మారింది. దాంతో ఇందులో అవకాశం దక్కించుకొని తమ టాలెంట్ చూపించాలని ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కానీ అక్కడ కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వరని, తమ వాళ్ళనే తీసుకువస్తారుగాని బయట వారికి అవకాశాలివ్వరని ఒక రూమర్ ఉంది.
Jabardasth Auditions: మీ ముందే మీకు బంగారం లాంటి అవకాశం వచ్చింది.
తాజాగా ఈ విషయంలో జబర్దస్త్ కామెడియన్ అదిరే అభి స్పందించాడు. కేవలం ఫేస్ బుక్ లో పరిచయమైన ఆదిని తీసుకొచ్చి బ్రేక్ ఇచ్చి ఈ రోజు హైపర్ ఆదిగా మార్చేశాడు అదిరే అభి. ఈ కారణంగానే అభిని చాలామంది మాకు కూడా అవకాశాలు ఇవ్వమని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. మీ ముందే మీకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ ఆడిషన్స్ లో మీ టాలెంట్, సత్తా చూపించి జబర్దస్త్ స్టేజీపై అడుగుపెట్టమని ఒక వీడియో విడుదల చేసాడు అభి.

jabardasth auditions are going on
Jabardasth Auditions: అర్జెంట్‌గా ఓ 2 నిమిషాల పాటు ఉండే స్కిట్ చేసి అందులో మీ టాలెంట్ మొత్తం చూపించండి
మరింతగా క్లారిటీ ఇస్తూ ఎలాంటి వీడియోలు చేయాలి, ఏం చేస్తే జబర్దస్త్ లో ఎంటరయ్యే అవకాశం ఉంది అనే విషయంలో కూడా అభి కొన్ని టిప్స్, హింట్స్ ఇచ్చాడు. అర్జెంట్‌గా ఓ 2 నిమిషాల పాటు ఉండే స్కిట్ చేసి అందులో మీ టాలెంట్ మొత్తం చూపించి ఆ ఆడిషన్ ని మా జబర్దస్త్ కి పంపించండి. మీరు కూడా ఇక్కడ స్టార్స్ అయిపోవచ్చు..అని తెలిపాడు. గత కొన్ని రోజులుగా స్కిట్స్ బాగా చేయని కొన్ని టీమ్స్ ను జబర్దస్త్ నుంచి తొలగించారు. వాళ్ల స్థానంలో కొత్త టీంస్ ని భర్తీ చేయడానికి ఇలా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. అందుకే తాజాగా ఆడిషన్స్ జరుపుతున్నారు. మరి ఎంతమంది కొత్తవాళ్ళు ఈ షో ద్వారా పరిచయం కానున్నారో చూడాలి.
ఇది కూడా చదవండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు
ఇది కూడా చదవండి ==> బిగ్ బాస్ షోలో గొడవలు.. అరియానాపై లాస్య కామెంట్స్..!
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన వర్ష అందాల ఆరబోత.. పరువుదీసిన ఇమాన్యుయేల్.. వీడియో !
ఇది కూడా చదవండి ==> రెచ్చిపోయిన రష్మీ, వర్షిణి.. బుల్లి నిక్కర్ చుపిస్తూ ఇంత తగ్గించుకొని వచ్చా వర్షిణి.. వైరల్ వీడియో