Ponniyin Selvan : మణిరత్నం సినిమా PS 1 హిట్ అవ్వాలి అంటే ఎంత రాబట్టాలో తెలుసా ? అయ్యే పనేనా ?
Ponniyin Selvan : ఇండియాస్ ఫైనెస్ట్ డైరక్టర్ లలో ఒకరైన మణిరత్నం నుంచి వచ్చిన మరో అద్భుతమైన సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా తీసిన ఈ సినిమా మొదటి పార్ట్ పి.ఎస్ 1 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే తమిళంలో మాత్రం సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మణిరత్నం తీసిన బాహుబలి సినిమా ఇదని తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు.ఈ సినిమా తెలుగులో కూడా భారీగానే రిలీజైంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో పి.ఎస్ 1 8.80 కోట్ల దాకా బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ కొట్టాలి అంటే 9 కోట్ల పైన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
అయితే మొదటి రోజు పి.ఎస్ 1 సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 5.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం లో మొదటి రోజు 2.70 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది డౌటే అని చెప్పొచ్చు.దసరా సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్.. కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా బెల్లంకొండ గణేష్ హీరోగా స్వాతిముత్యం సినిమా కూడా వస్తుంది. స్ట్రైట్ తెలుగు సినిమాలు వస్తున్న ఈ టైం లో పొన్నియిన్ సెల్వన్ చూస్తారన్న గ్యారెంటీ లేదు. అయితే ఆ సినిమాలు రిలీజ్ అవడానికి మరో నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈలోగా పి.ఎస్ 1 బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
మణిరత్నం సినిమా అంటే ఒక బ్రాండ్ ఉంటుంది. అయితే బాహుబలి రేంజ్ లో వచ్చిన పి.ఎస్ 1 మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. మనవాళ్లకి నచ్చలేదు కాబట్టి సినిమా కలక్షన్స్ మందకొడిగా సాగుతుంది లేదంటే ఫస్ట్ డే నే రికార్డ్ వసూళ్లు తెచ్చిపెట్టేవారు. పిఎస్ 1 సినిమాని తెలుగు ఆడియన్స్ మెచ్చని కారణంగా తమిళ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక మీదట ఏ తెలుగు సినిమా తమిళ డబ్ అయినా సరే చూడొద్దని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి సినిమా అయినా సరే తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. అలాంటి తెలుగు ఆడియన్స్ నిర్ణయాన్ని తప్పుబట్టం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు.