Karthika Deepam Nirupam : తలపట్టుకున్న డాక్టర్ బాబు .. మంజుల చేష్టలపై విసిగిన నిరుపమ్
Karthika Deepam Nirupam : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టం. ప్రపంచంలోని ఏదో మూల ఇంకేదో జరిగితే అది ఇక్కడ ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రాం రీల్ వీడియోల్లో అయితే రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మ్యారీ మీ అంటూ ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. మొన్నా మధ్య సమంత కూడా ఇదే రీల్ వీడియో చేసింది. తన ఫ్రెండ్స్ సాధన సింగ్, ప్రీతమ్‌లతో కలిసి సమంత చేసిన ఈ రీల్ వీడియో బాగానే వైరల్ అయింది. అలా ఇప్పుడు నిరుపమ్‌తో కలిసి మంజుల కూడా ఈ రీల్ వీడియో చేసింది.
ఇందులో నిరుపమ్ ఎక్కడకు వెళ్తే అక్కడ మ్యారీ మీ అంటూ వింత వింత స్టెప్పులు వేసింది. ఇదేం గోలరా బాబు అన్నట్టుగా నిరుపమ్ తలపట్టుకున్నాడు. తలకొట్టుకుంటూ ఈ బాధ ఏంటన్నట్టుగా అక్కడ నుంచి వెళ్తుంటాడు. అయినా కూడా మంజుల మాత్రం వదిలిపెట్టదు. నిరుపమ్‌ను వెంటే ఉంటుంది. అలా మొత్తానికి నిరుపమ్‌ని విసిగిస్తూ చేసిన ఈ రీల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. నిరుపమ్ ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయ్ అని, కింగ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్స్ అని నిరుపమ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Manjula Marry Me Reel With Karthika Deepam Nirupam Paritala
చివర్లో మంజుల ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ జంట మాత్రం నెట్టింట్లో అందరినీ బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. నిరుపమ్ కంటే ఎక్కువగా మంజులనే నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటుంది. తాను ఉండటమే కాకుండా తన భర్తని కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంటుంది. అందుకే మంజుల తన పేరు మీద యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసింది. మంజుల నిరుపమ్ అని చానెల్ ఓపెన్ చేసి అందులో రకరకాల వీడియోలను పెడుతుంటుంది. అందులో నిరుపమ్‌కు సంబంధించిన విషయాలను, ఇంట్లోని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది మంజుల.
View this post on Instagram