Manjula Paritala : నా కల నెరవేరబోతోంది.. భర్త, అత్త గురించి చెబుతూ మంజుల పరిటాల కంటతడి

Authored By aruna | The Telugu News | Published on: August 2, 2022, 6:40 pm

Manjula Paritala : మంజుల పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమెకు డాక్టర్ బాబు భార్యగా ఎక్కువ ఫేమస్ అయింది. కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్ ఫేమస్ అయ్యాడు. కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ ఎంత ఫేమస్ అయ్యాడో.. డాక్టర్ బాబు భార్యగా మంజుల బయట అంత క్రేజ్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ తమ యూట్యూబ్ చానెల్‌తో ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. మంజుల నిరుపమ్ అనే ఈ యూట్యూబ్ చానెల్ ప్రస్తుతం దూసుకుపోతోంది. తాజాగా మంజుల ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన అమ్మానాన్నలకు ఇళ్లు కొనిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట.

ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఆనందాన్ని, సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఎమోషన్ అవుతూ కంటతడి పెడుతూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.ఆనంద భాష్పాలు కారుస్తూ తన భర్త, అత్త ఎంత గొప్పవారో తెలిపింది. మా అమ్మానాన్నలకంటూ సొంతంగా ఇళ్లు ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని మంజుల తెలిపింది. మేం నలుగురం ఆడపిల్లలమే. అబ్బాయిలు లేరని అమ్మానాన్నలకు అనిపించకూడదని, వారికి మేం అండగా నిలబడాలని, ఇళ్లు కట్టించాలని అనుకునేవాళ్లమని మంజుల చెప్పుకొచ్చింది. అయితే మనం ఎన్నో అనుకుంటాం కానీ.. అన్నీ చేయలేం.. మన లైఫ్‌లోకి ఎవరో వస్తారు.. వచ్చిన వారు అర్థం చేసుకుని, అండగా నిలబడటం గొప్ప.

Manjula Paritala ABout Her Husband Nirupam In Constructing Home For Mother And Father

Manjula Paritala ABout Her Husband Nirupam In Constructing Home For Mother And Father

మా ఆయన నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మా అత్త గారు అంటుంటారు. మీ అమ్మనాన్నలకు కూడా ఓ ఇళ్లు ఉండాలి.. కొనివ్వండని అత్తగారు అంటుంటారని మంజుల చెప్పుకోచ్చింది. మా అమ్మానాన్నలకు ఇళ్లు కొనివ్వాలనేది నా కల. అదే నా లైఫ్ డ్రీమ్. ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది. మా అమ్మనాన్నల కోసం ఓ ఇళ్లు చూశానంటూ వాటికి సంబంధించిన వీడియోలు చూపించింది. అయితే మంజుల ఇందులో పదే పదే కంటతడి పెడుతూ.. ఆనంద భాష్పాలను కార్చేసింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp