Karthika Deepam : కార్తీకదీపం డాక్టర్ బాబు బర్త్ డే.. మంజుల పరిటాల స్పెషల్ విషెస్
Karthika Deepam కార్తీకదీపం Karthika Deepam డాక్టర్ బాబుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఆదరణను సొంతం చేసుకున్నాడు నిరుపమ్ పరిటాల. బుల్లితెర సూపర్ స్టార్, బుల్లితెర శోభన్ బాబుగా ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక అతని భార్య మంజుల పరిటాల సైతం సీరియల్స్‌తో బిజీగా ఉంటున్నారు. మంజులను సోషల్ మీడియాలో ఎక్కువగా డాక్టర్ బాబు భార్య అని సంబోధిస్తుంటారు. అలా నిరుపమ్ అంతలా ఆ పాత్రతో జనాలకు కనెక్ట్ అయిపోయారు.

Manjula Paritala Birthday Wishes To Nirupam Paritala
నిరుపమ్ మంజుల లవ్ స్టోరీ కూడా అందరినీ కట్టిపడేస్తుంది. చంద్రముఖి Karthika Deepam సీరియల్ వీరి జీవితాన్ని మార్చేసింది. ఆ సీరియల్ సమయంలోనే ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. అయితే చంద్రముఖి అనే సీరియల్ నిరుపమ్‌కు మొదటిది. కానీ మంజుల మాత్రం అంతకు ముందే కన్నడ సీరియల్స్‌లో నటించారు. అలా నిరుపమ్ మంజులకు చంద్రముఖి సీరియల్ ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. ఇక ఇంట్లో డాక్టర్ బాబు ఎంత సరదాగా ఉంటారో కూడా మంజుల చెబుతూ ఉంటారు.
Karthika Deepam కార్తీకదీపం డాక్టర్ బాబు బర్త్ డే.. మంజుల పరిటాల స్పెషల్ విషెస్

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights
ఇంట్లో తాను ఏది అడిగినా చేయడని, అదే తమ పిల్లాడు అడిగితే కాదనకుండా చేస్తాడని మంజుల తెలిపింది. అందుకే తనకు ఏది కావాలన్నా వాడితో చెప్పిస్తాను అని సంసార రహస్యాలను బయటపెట్టింది. అలా ఈ ఇద్దరి అన్యోన్య దాంపత్య నెట్టింట్లోనూ చెబుతూ ఉంటుంది. ఇద్దరూ కలిసి దిగే ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. భర్త బర్త్ డే సందర్బంగా మంజుల స్పెషల్ పోస్ట్ చేసింది. బుల్లితెర సూపర్ స్టార్‌కు హ్యాపీ బర్త్ డే అని తెలిపింది. ఈ జీవితంలో ప్రేమంటే నువ్వే అని చెప్పుకొచ్చింది.