Tamannaah : నీకు ఇదే ఎక్కువ!.. తమన్నా పరువుతీసిన మాస్టర్ చెఫ్ సంస్థ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 28 October 2021, 9:51 am

Tamannaah  : మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలోంచి తమన్నా అవుట్.. అనసూయ ఇన్ అయిందన్న సంగతి తెలిసిందే. లోపల ఏం జరిగిందో ఏమో గానీ.. తమన్నా వెళ్లిపోయింది.. పొమ్మని చెప్పారో ఏమో గానీ మొత్తానికి ఆ కథ ముగిసింది. తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నిర్వాహకుల మీద తమన్నా కేసు పెట్టేసింది. ముందుగా మాట్లాడుకున్న మొత్తాన్ని త‌నుకు చెల్లించ‌లేదంటూ లీగ‌ల్ యాక్ష‌న్‌కు దిగింది. కానీ నిర్వాహకులు మాత్రం తమన్నాకే షాక్ ఇచ్చారు.

Master Chef Telugu And Tamannaah Remuneration Issue

Master Chef Telugu And Tamannaah Remuneration Issue

ఆమె వ‌ల్ల త‌మ‌కు చాలా న‌ష్టం జ‌రిగింద‌ని, ఇప్ప‌టికే చెల్లించిన మొత్తం కూడా ఎక్కువే అన్న‌ట్టుగా నిర్వాహ‌కులు త‌మ వివ‌ర‌ణ‌లో పేర్కొన్నార‌ట‌. షో హిట్ అనిపించుకోలేదు. వంట ప్రోగ్రామ్ కు త‌మ‌న్నా యాంక‌రింగ్ ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో లెక్క‌లేసుకుపోయారేమో. స‌రిగ్గా 20 ఎపిసోడ్లు పూర్తి అవుతుండ‌గానే ఆమెను తప్పించేశారు. ఆ స్థానంలో అన‌సూయ వ‌చ్చింది. ఆమెకు 18 రోజుల షూటింగుకు గానూ రెండు కోట్ల రూపాయ‌ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టుగా చెప్పారు.

Tamannaah  తమన్నాకు మాస్టర్ చెఫ్ ఝలక్

Tamannaah Red dress pics

Tamannaah Red dress pics

ఆమె రెండు రోజుల పాటు షూటింగుకు హాజ‌రు కాలేద‌ని, దీంతో అప్ప‌టి వ‌ర‌కూ చేసుకున్న ఏర్పాట్ల‌కుగానూ త‌మ‌కు ఐదు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ న‌ష్టం వ‌చ్చింద‌ని వారు వాదిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. తాము త‌మ‌న్నాకు కోటిన్న‌ర రూపాయ‌ల వ‌ర‌కూ చెల్లించిన‌ట్టుగా వారు కౌంట‌ర్లో పేర్కొన్నార‌ట‌. ఆమె షూటింగుకు ఎగ్గొట్ట‌డంతో త‌మ‌కు ఐదు కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌చ్చింద‌న్నార‌ట‌. మొత్తానికి తమన్నాకు ఇప్పటి వరకు ఇచ్చిందే ఎక్కువే అనే కోణంలో వారి వివరణ ఉంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి