Hero Shivaji : మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినా శివాజీ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hero Shivaji : మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినా శివాజీ ..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 January 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Hero Shivaji : మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయినా శివాజీ ..!

Hero Shivaji : సీనియర్ యాక్టర్ శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘ #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ‘ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందుతుంది. ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కుతున్నాయి. 1990లో మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ తరుణంలో సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ మీట్లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ ప్రేక్షకులు థ్రిల్లర్లు, మర్డర్ సీన్లు చూడాలని అనుకోరని, వారికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అని అన్నారు. కుటుంబంలో అందరూ థ్రిల్లర్స్ లాంటివి చూడరు అని చెప్పారు.

మన ప్రతిరోజు జీవితాలు ఆధారంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్టోరీలు ఎక్కువగా రావటం లేదని శివాజీ చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ పెడతారు. వాళ్లకు కావాల్సిందే అప్పుడు మర్డర్ సీన్స్ లు కాదు థ్రిల్లర్లు కాదు వాళ్లకు కావాల్సిందే ఎంటర్టైన్మెంట్. నాకున్న అనుభవంతో చెబుతున్నా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఈ విధంగా ఆలోచించాలి. థ్రిల్లర్స్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమైన పని కాదేమో కానీ మన లైఫ్ ని క్రియేట్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దాని రీచ్ కూడా తొందరగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా థ్రిల్లర్స్ చూడరు. చాలా ప్లాట్ ఫామ్ లలో పిల్లలు స్టూడెంట్స్ ఫోన్ల లోనే చూస్తుంటారు. 10 శాతం మంది ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. ఆరంభంలో కొన్ని థ్రిల్లర్లకు బాగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే విసుగు వచ్చింది. దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసింది హ్యాష్ ట్యాగ్ 90స్ అని శివాజీ అన్నారు.

తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకూడదని నిశ్చయించుకున్నానని శివాజీ అన్నారు. తనకు ఏ పార్టీకి అంటగట్టొద్దని ఒకవేళ అలా చేస్తే ఆ పార్టీలోకి వెళ్లి అందరి దూల తీర్చేస్తానని అన్నారు. తన జోలికి రావద్దని శివాజీ అన్నారు. తాను నిజాలు మాత్రమే మాట్లాడతానని అందుకే రాజకీయాలకు పనికిరానని శివాకి తేల్చేశారు. అయితే ప్రజల గొంతుకగా ఉంటానని అన్నారు. నటనపై పూర్తి దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు. ఇక నైంటీస్ వెబ్ సిరీస్ లో శివాజీ తో పాటు వాసుకి ఆనంద్, మౌళి తనుజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక స్నేహాల్ కీలక పాత్రలు పోషించారు. మధ్యతరగతి కుటుంబం పరిస్థితుల్లో ప్రధాన కథాంశంగా ఈ సిరీస్ రూపొందింది. మధ్యతరగతి పెద్దాయన ఉపాధ్యాయుడిగా శివాజీ నటన ఈ సిరీస్లో ఆకట్టుకుంది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది