
meena celebrates friendship day with her friends
Meena : మీనా… ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీనా ఆ తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కి పరిమితం అయింది. సన్ ఆఫ్ ఇండియా సినిమాలో చివరిసారిగా కనిపించింది నటి మీనా. అంతకుముందు బ్రోడాడీ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్‌లతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఇటీవల మీనా ఇంట్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. దీంతో ఆమె బాగా కుంగిపోయింది. చాలారోజుల వరకు ఇంటికే పరిమితమైపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తోన్న ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు సినిమాలో మీనా కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటీవల ఆ సినిమా సెట్‌లో ప్రత్యక్షం అయింది.
మీనా తన భర్త మరణం తర్వాత చాలా దిగాలుగా ఉంది. . మీనాకి మనో ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పటికి కొందరు నటీనటులు మీనా నివాసానికి వెళుతూ ఆమెని పరామర్శిస్తున్నారు. మీనా కూడా ఇప్పుడిపుడే బాధని దిగమింగుతూ నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారు. తాజాగా మీనా నివాసానికి అలనాటి హీరోయిన్లు రంభ, సంగీత, సంఘవి వెళ్లారు. మీనాని పరామర్శించారు. వారితో సంతోషంగా కలసి ఉన్న ఫొటోస్ ని మీనా షేర్ చేసింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వారందరు మీనా ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ఫొటోలలో మీనా కూడా కాస్త సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. అందరూ హ్యాపీ స్మైల్ తో ఫొటోలకి ఫోజులు ఇచ్చారు. రంభ, మీనా, సంఘవి, సంగీత అందరూ 90 దశకంలో హీరోయిన్లుగా రాణించిన వారే.
meena celebrates friendship day with her friends
మీనా సాగర్ దంపతులకు ఒక కుమార్తె నైనిక సంతానం. నైనిక.. దళపతి విజయ్ – Thalapthy Vijay తేరి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మీనా భర్త సాగర్ చాలా కాలంగా ఊపిరి తిత్తుల సమస్యలతో భాదపడుతున్నారు. మీనా ఇంట్లో పావురాలు ఉండడంతో వాటి నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువై ఆయన మరణించారని వదంతులు కూడా వినిపించాయి. అయితే ఆ రూమర్స్ ని మీనా కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రస్తుతం సినిమాలలో చాలా బిజీగా ఉంటూ భర్త లేని విషయాన్ని కాస్త దిగమింగుకుంటుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.