Meera Jasmine : సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్లామర్ షో రచ్చ‌.. ఈ అమ్మ‌డి అందాల‌కు కుర్ర హీరోయిన్స్ కూడా పనికి రారేమో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Meera Jasmine : సెకండ్ ఇన్నింగ్స్‌లో గ్లామర్ షో రచ్చ‌.. ఈ అమ్మ‌డి అందాల‌కు కుర్ర హీరోయిన్స్ కూడా పనికి రారేమో..!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 February 2022,4:00 pm

Meera Jasmine : అందాల ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. 39 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్లుకునేలా చేస్తుంది. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే కెరీర్‌లో పెద్ద‌గా గ్లామ‌ర్ షో చేయని మీరా జాస్మిన్ ఇప్పుడు మాత్రం తెగ రెచ్చిపోతుంది. ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. పెళ్లి తరవాత కూడా మీరా లో ఎలాంటి మార్పు రాలేదు. కుర్ర హీరోయిన్లకు దీటుగా హాట్ గా కనిపిస్తోంది.

తాజాగా మీరా జాస్మిన్ త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో హోయ‌లు పోతూ నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షో చూసి కుర్ర భామ‌లు కుళ్లుకుంటున్నారు. అయితే ఒక‌ప్పుడు గ్లామర్‌కి అతీతంగా వెండితెరపై మ్యాజిక్‌ చేసింది మీరా జాస్మిన్. వరుస అవకాశాలు అందుకుని టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కెరీర్‌ పీక్‌లో ఉండగా సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లు ఆమె సినీ లైఫ్‌ ట్రాక్‌ తప్పేలా చేసింది. వరుస పరాజయాలతో ఉన్న ఆమె మ్యారేజ్‌ చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిల్‌ అయ్యింది.

meera jasmine stunning looks shakes the internet

meera jasmine stunning looks shakes the internet

Meera Jasmine : ఆ అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే…

‘అమ్మాయే బాగుంది’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్‌. ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’ వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’, ‘ఆకాశ రామన్న’ సహా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లకి దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అనిల్‌ జాన్‌ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. అత‌నితో విడాకుల త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటాలని అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది