Chiranjeevi : గెస్ట్‌ లపై ఆధారపడుతున్న మెగాస్టార్‌.. ఈసారి వెంకటేష్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 12, 2022, 8:00 pm

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు భోళా శంకర్ మరియు వాల్తేరు వీరన్న సినిమాలు కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే చిరంజీవి ప్రతి సినిమాలో కూడా ఈ మధ్య ఒక గెస్ట్ ఆర్టిస్ట్ ఉండడం.. అది కూడా స్టార్ ఉండడం చర్చనీయాంశంగా మారుతుంది. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇక వాల్తేరు వీరన్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అంతే కాకుండా ఆ సినిమాలోనే వెంకటేష్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ సినిమా అంటే ఒకప్పుడు ఓ స్థాయి అంచనాలు ఉండేవి.. కానీ ఇప్పుడు ఆ అంచనాలను కల్పించేందుకు చిరంజీవి సినిమాలో ఇతర స్టార్ హీరోలను నటింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు చిరంజీవి విషయంలో చాలా చర్చ జరుగుతుంది.

megastar chiranjeevi using stars as guest in his movies for promotions

megastar chiranjeevi using stars as guest in his movies for promotions

ఆయన సినిమాల స్థాయి గతంలో మాదిరిగా లేదు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఆచార్య సినిమా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక మెగాస్టార్.. ఆయన్ని ఏ ఒక్కరు కూడా చేరుకోలేరు.. ఆయన స్థాయిని విమర్శించే హక్కు ఏ ఒక్కరికి లేదు అంటూ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో స్టార్స్ ని గెస్ట్ ఆర్టిస్టులుగా తీసుకోవడానికి కారణం కేవలం కథ డిమాండ్ అని అంతే కాకుండా చిరంజీవి మంచి మనసు అనేది కొందరి అభిప్రాయం.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp