mehreen pirzada : మెహరీన్ నిశ్చితార్థం.. కాబోయే వరుడితడే
mehreen pirzada : ఈ మధ్య సెలెబ్రిటీల వివాహాలతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. కొందరు ప్రేమ వివాహాలతో సందడి చేస్తుంటే.. ఇంకొందరు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతో సందడి చేస్తున్నాడు. గతేడాది, ఈ ఏడాది హీరో హీరోయిన్లు వివాహా బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించేశారు. ఈ జాబితాలోకి తాజాగా మెహ్రీన్ కూడా చేరింది. తాజాగా మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
mehreen pirzada : మెహరీన్ నిశ్చితార్థం..వరుడు ఎవరంటే?
మొత్తానికి మెహ్రీన్ తన ఇన్నేళ్ల రిలేషన్ షిప్‌కు తెర దించేసింది. తన స్నేహితుడు, ప్రియుడు, రాజకీయ నాయకుడైన భవ్య బిష్ణోయ్‌ను పెళ్లాడబోతోంది. ఈ క్రమంలో జోద్ పూర్‌లో నిశ్చితార్థం జరిగింది. శుక్రవారం నాడు సంప్రదాయ పద్దతిలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుక మాత్రం అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరిగినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనలేదు.

mehreen pirzada got engagement with Bhavya Bishnoi
మొత్తానికి మెహ్రీన్ పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మెహ్రీన్ మొదటి సినిమాతో ఆకట్టుకుంది. కానీ నటన రాదు.. హావభావాలు కూడా పలకవు అంటూ అందరూ ట్రోల్ చేసేశారు. హిట్ల కంటే ఎక్కువగా డిజాస్టర్లే మెహ్రీన్ ఖాతాలో ఉన్నాయి. ఎఫ్2 మాత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. చివరగా వచ్చిన అశ్వథ్థామ డిజాస్టర్‌గా నిలిచింది.