Mehreen : మత్తెక్కిస్తున్న మెహ్రీన్ అందాలు.. కుర్ర‌భామ అందాల‌తో మాయ చేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mehreen : మత్తెక్కిస్తున్న మెహ్రీన్ అందాలు.. కుర్ర‌భామ అందాల‌తో మాయ చేస్తుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 June 2022,10:00 am

Mehreen : కృష్ణ‌గాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్. .ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత బడా బడా ఆఫర్లు వచ్చినా తెలిసో తెలియకనో..మంచి ఆఫర్స్ మిస్ చేసుకుని..సోది సినిమాలకు ఓకే చేసి..ఫలితంగా అట్టర్ ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ టైంలో అనిల్ రావిపుడి F2 లొ అవకాశం ఇచ్చి..మళ్లీ ఫాం లోకి తెచ్చాడు .. వరుణ్ కంత్రి గార్ల్ ఫ్రెండ్ గా అందరిని తన నటన తో ఫిదా చేసింది. ఇక ఆతరువాత కొన్ని సినిమాలు చేసిన వాటిల్లో మహానుభావుడు సినిమా తప్పిస్తే.. మంచి సినిమాలు ఏం లేవు.

ఆ తరువాత సడెన్ గా మెహ్రీన్ గ్రాండ్‌గా భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరగడంతో ఇక పెళ్లి వేడుకే అని అంతా అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. త‌న పెళ్లి పెటాకులు కావ‌డంతో మెహ్రీన్ జూలు విదిల్చింది. త‌న‌లోని గ్లామ‌ర్‌ని ప‌రిచ‌యం చేస్తూ కేక పెట్టిస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్ లో క‌నిపించింది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మెహ్రీన్‌ని చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. చాలా రోజుల త‌ర్వాత మెహ్రీన్ ఇలా క్యూట్‌గా క‌నిపించే స‌రికి ప్ర‌తి ఒక్క‌రు ఖుష్ అవుతున్నారు. ప్ర‌స్తుతం మెహ్రీన్ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

mehreen mesmarizing looks

mehreen mesmarizing looks

Mehreen : మెహ్రీన్ క్యూట్ లుక్స్..

మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది. ఇటీవల విడుదలైన ఎఫ్3 మూవీ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీనితో ఎఫ్3 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. అయితే తాజాగా లంగా ఓణీలో మెహ్రీన్ పంచె వన్నెల చిలుకలా మెరిసిపోతోంది. పింక్, గ్రీన్ కాంబినేషన్ లో మెహ్రీన్ లంగా ఓణీ ధరించింది. కలర్ ఫుల్ హాఫ్ శారీలో మెహ్రీన్ చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటోంది

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది