Minister Roja : సీనియర్ హీరోయిన్ జమున మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్న మంత్రి రోజా వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 28 January 2023, 11:00 am

Minister Roja : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటీనటులు వరుస పెట్టి మరణిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే నిన్న జనవరి 27వ తారీకు సీనియర్ నటి జమున మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. నిన్ననే ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు.  హైదరాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites

Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites

జమున కూతురు డాక్టర్ స్రవంతి చేతుల మీదగా జరిగాయి. అయితే ఈ క్రమంలో చివరి క్షణంలో సినీనటి మరియు వైసీపీ మంత్రి రోజా హాజరయ్యారు. జమున మృతదేహం చూసి విలపించారు. రోజా కన్నీరు పెట్టుకుంటూ మృతదేహం వద్ద నివాళులు అర్పించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. 86 సంవత్సరాల వయసు కలిగిన జమున దాదాపు 190 కి పైగా సినిమాలలో నటించడం జరిగింది.

Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites

Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites

కర్ణాటకలో పుట్టిన గాని తెలుగు వారిని తన వారిగా భావించి జమున ఇక్కడే స్థిరపడటం జరిగింది. అంతేకాదు రాజకీయాల్లో కూడా ఆమె రాణించారు. జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్ మరియు బీజేపీ లలో అప్పట్లో జాయిన్ అయ్యి రాణించారు. రాజమండ్రి ఎంపీగా కూడా జమున ఎన్నిక కావడం జరిగింది. ఈ క్రమంలో జమున మృతి పట్ల ఇండస్ట్రీలో చాలామంది  సంతాపం వ్యక్తం చేశారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp