Minister Roja : రోజాకి ఇబ్బందులు తప్పవా – అనవసరంగా చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు..!

Advertisement

Minister Roja : వైసీపీ మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. అయితే.. తన ఫైర్ ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతోంది. దానికి కారణం ఆమె కేవలం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అంటే ఏకంగా మెగాస్టార్ తో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబును కూడా ఆమె వదలడం లేదు. అందరిని కలిపి మెగా బ్రదర్స్ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గానూ మారింది. మెగా అభిమానులు కూడా రోజా వ్యాఖ్యలపై చిర్రెత్తుతున్నారు. ఆమె పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో రోజాను నగరి నియోజకవర్గం నుంచి ఓడించాలని మెగా అభిమానులు కంకణం కట్టుకున్నారు.

Advertisement

ఇప్పటికే మెగా అభిమానులంతా ఒక్కటై తిరుపతి, చిత్తూరులో సమావేశాలు పెట్టారు. రోజా తన నోరును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మెగాస్టార్ పై కూడా రోజా నోరు పారేసుకోవడంపై మెగా అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ… తమను అభిమానించిన ప్రేక్షకుల కోసం కానీ.. తమను అభిమానించే ప్రేక్షకుల కోసం కానీ తమ సంపాదన నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పుకొచ్చారు. తమ ప్రాంతానికే అసలు ఏం చేయలేదని.. అందుకే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అందరూ తమ ప్రాంతాల్లో ఓడిపోయారని చెప్పుకొచ్చారు రోజా. వీళ్లు ముగ్గురికీ రాజకీయ భవిష్యత్తు లేదని ఆమె తేల్చి చెప్పారు.

Advertisement
why minister roja attacks on mega family
why minister roja attacks on mega family

Minister Roja : ఎవరి అండ చూసుకొని రోజా రెచ్చిపోయినట్టు?

అయితే.. రోజా ఎవరి అండ చూసుకొని రెచ్చిపోయి మరీ మాట్లాడుతోందని మెగా అభిమానులు అంటున్నారు. వాళ్లు ఓడిపోయారు నిజమే కానీ.. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన రాజకీయాలకు వాళ్లు పనికిరారు అనడం కరెక్ట్ కాదని మెగా అభిమానులు రోజాకు హితువు పలుకుతున్నారు. రోజా కూడా ముందు ఓడిపోయింది కదా అనే విషయాలను గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్, నాగబాబు గురించి మాట్లాడితే ఓకే కానీ.. అసలు రాజకీయాలనే వదిలేసిన చిరంజీవి గురించి కూడా రోజా వ్యాఖ్యానించడంపై మెగా అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు.. మెగా ఫ్యామిలీనే కావాలని రోజా ఎందుకు టార్గెట్ చేసింది అంటూ తనను ఓడించేందుకు మెగా అభిమానులు మొత్తం ఏకమై.. ఇప్పటి నుంచే నగరిలో వ్యూహాలు రచించడం మొదలు పెట్టారు.

Advertisement
Advertisement