Minister Roja : జబర్దస్త్ పై రోజా ఇంకా ఆధిపత్యం కనబర్చుతుందా.. ఆమెకు ఎందుకు భయపడుతున్నారు?
Minister Roja : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో దాదాపు పది సంవత్సరాల పాటు రోజా జడ్జిగా వ్యవహరించింది. ఇటీవల ఆమె ఏపీ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసింది. జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నా కూడా కార్యక్రమంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు ఆమె కారణం అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లో కొత్త టీం లీడర్లుగా ఎవరైనా ఎంపిక అవ్వాలన్నా.. […]
Minister Roja : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో దాదాపు పది సంవత్సరాల పాటు రోజా జడ్జిగా వ్యవహరించింది. ఇటీవల ఆమె ఏపీ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసింది. జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నా కూడా కార్యక్రమంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు ఆమె కారణం అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లో కొత్త టీం లీడర్లుగా ఎవరైనా ఎంపిక అవ్వాలన్నా..
కొత్తగా ఎవరైనా జబర్దస్త్ కంటెస్టెంట్స్ అవ్వాలన్నా రోజా వ్యవహారం నడిపిస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఇటీవల రోజా మెగా ఫ్యామిలీ పై చేసిన విమర్శలకు జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఒక్కరు స్పందించలేదు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన వారు రోజాపై విమర్శలు చేస్తే కచ్చితంగా ఆమె వారిని జబర్దస్త్ నుండి తొలగించే అవకాశం ఉంటుందని, అందుకే ఆమెకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. గెటప్ శ్రీను ఒక్కడు రోజా గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఆయన కూడా వెంటనే తన పోస్ట్ ని డిలీట్ చేసి
వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ ని జబర్దస్త్ లో ఉన్న వారందరూ కూడా అభిమానిస్తారు, అలాంటి చిరంజీవిని అవమానించినప్పుడు రోజా పై ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేయాలి. కానీ ఆమెను విమర్శిస్తే జబర్దస్త్ లో తమ యొక్క స్థానం గల్లంతవుతుందేమో అనే ఆందోళనతో ఆమె ను ఏ ఒక్కరు కూడా విమర్శించలేదు. దీన్నిబట్టి జబర్దస్త్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి.