Minister Roja : ప్రత్యర్థులపై డైలాగులతో రెచ్చిపోయే మంత్రి రోజా కోలాటం డాన్స్… వీడియో వైరల్..!!
Minister Roja : వైసీపీ మంత్రి రోజా అందరికీ సుపరిచితురాలే. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. వైయస్సార్ రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన సమయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం తర్వాత ఆయన మరణాంతరం జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగటం తెలిసిందే. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేగా రోజా ఫస్ట్ టైం కలవడం జరిగింది.
ప్రతిపక్ష పార్టీలో కీలక పాత్ర పోషించి టీడీపీనీ చెడుగుడు ఆడేసుకోవడం జరిగింది. తర్వాత రెండోసారి వైసీపీ గెలిచాక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సెకండ్ టర్మ్ లో రోజాకి మంత్రి పదవి రావటం తెలిసిందే. ఈ క్రమంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను తన డైలాగులతో… ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వడంలో రోజా ముందుంటారు. అయితే సాంస్కృతి శాఖ మంత్రి పగ్గాలు చేపట్టాక రాష్ట్రవ్యాప్తంగా పలు
కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉండే రోజా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోలాటం ఆటాడటం జరిగింది. మంత్రి రోజా కోలాటం ఆడిన ఆట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో చిలక జోస్యం కూడా మంత్రి రోజా చెప్పించుకున్నారు. సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయంగా తిరుగులేదు అన్నట్టు చెప్పుకు రావడం జరిగింది. అనంతరం కార్యక్రమం వద్ద పెట్టిన స్టాల్స్ మొత్తం రోజా పరిశీలించారు.