M. M. Keeravani : ఆర్‌ఆర్‌ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి గోల్డెన్ గ్లోబ్..!!
M. M. Keeravani ; లాస్ ఏంజిల్స్ లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలు అటహాసంగా స్టార్ట్ అయ్యాయి. వరల్డ్ వైడ్ ఆడియోన్స్ ఆదరణ పొందిన సినిమాలు ఈ అవార్డ్స్ కోసం అనేక కేటగిరీలలో పోటీ పడుతుంటాయి. దీనిలో భాగంగా ఇండియా నుంచి ఫస్ట్ టైం “RRR” చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఇంకా బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిలిం క్యాటగిరిలో నామినేషన్ లలో నిలిచింది. “RRR” చిత్రంలో హైలైట్ పాట “నాటు నాటు” సాంగ్ అవార్డు సొంతం చేసుకుంది.
భారతీయ చలనచిత్రా రంగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న చిత్రంగా “RRR” హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డుని అంతర్జాతీయ వేదికపై అందుకున్నారు. దీంతో సినిమా యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. ఇదే సమయంలో పలువురు సినీ పెద్దలు సెలబ్రిటీలు “RRR” చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు నెటిజెన్ లు అభిమానులు కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రావడం పట్ల అభినందనలు తెలిపారు. గతంలో ఇండియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ …కీరవాణికి సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందనలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇది చారిత్రాత్మక విజయం..అంటూ అభినందించారు. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది అని ప్రశంసల వర్షం కురిపించారు.