M M Keeravani : ఆ ఒక్క మాటతో నెటిజన్స్ ఇంతగా ట్రోల్ చేస్తున్నారు పాపం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

M M Keeravani : ఆ ఒక్క మాటతో నెటిజన్స్ ఇంతగా ట్రోల్ చేస్తున్నారు పాపం..!

 Authored By govind | The Telugu News | Updated on :6 July 2022,7:30 pm

M M Keeravani : టాలీవుడ్‌లో ఎం ఎం కీరవాణి ఎంత పాపులర్ సంగీత దర్శకుడో అందరికీ తెల్సిసిందే. ఆయన సినిమాకు సంగీతం అందించారంటే మ్యూజికల్‌గా పెద్ద హిట్ ఆల్బం ఇచ్చేస్తారు. కమర్షియల్ సినిమా, భక్తి సినిమా, పౌరాణిక సినిమా, మైథలాజికల్ సినిమా..ఇలా ఎలాంటి జోనర్ తీసుకున్నా కూడా కీరవాణి మ్యూజిక్ సినిమాకు మేయిన్ పిల్లర్ అవ్వాల్సిందే. ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి అత్యత సన్నిహితుడు, బంధువు అయిన కీరవాణి ఆయన సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు. జక్కన్న సినిమా అంటే కీరవాణి సంగీత దర్శకుడు అని బ్లైండ్ గా అందరూ ఫిక్సైవుతారు.

ఇక పాన్ ఇండియా సినిమాలకు కీరవాణి ఇప్పుడు కేరాఫ్ అడ్రస్. తెలుగులో పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే, జెంటిల్ మేన్ సీక్వెల్ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో మరకతమణిగా, బాలీవుడ్‌లో ఎం ఎం క్రీమ్ గానూ పాపులర్. సంచలన దర్శకుడు రాంగోపా వర్మ తీసిన ఓటీటీ మూవీ జీఎస్టీకి సంగీతం అందించారు. ఇలా చాలా ప్రొఫషనల్‌గా ఉండే కీరవాణి సహనం కోల్పోయి నిన్న ఓ బూతు పదంతో ట్వీట్ చేసి హాట్ టాపిక్ అయ్యారు.

Netizens Trollings on M M Keeravani

Netizens Trollings on M M Keeravani

M M Keeravani : ఎందుకిలా సహనం కోల్పోయారంటూ కామెంట్స్

ప్రముఖ సౌండ్ ఇంజనీర్ అస్కార్ గ్రహీత రసూల్ పోకుట్టి ఆర్ఆర్ఆర్ మూవీ గురించి సంచల వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేగింది. దీనిపై నిర్మాతల్లో ఒకరైన శోభుయార్ల గడ్డ స్పందిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎం ఎం కీరవాణి రియాక్ట్ అయి చాలా స్ట్రాంగ్‌గా వరుస ట్వీట్స్‌తో సోషల్ మీడియా ద్వారా రసూల్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఓ ట్వీట్‌లో కీరవాణి రసూల్ పేరులోనే ఉన్న ఓ పదాన్ని బూతు అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టి మళ్ళీ కొద్దిసేపటికే డిలీట్ చేశారు. దాంతో చాలా క్లీన్‌గా ఉండే కీరవాణి ఎందుకిలా సహనం కోల్పోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆడవారి ప్రవేట్ పార్ట్ మీద గతంలో ఒక రచయిత పాట రాస్తేనే సహించని కీరవాణి ఇప్పుడు ఇలా హర్ట్ అయ్యారంటే రసూల్ కామెట్స్ ఎంతగా బాధించి ఉంటాయో అని సపోర్ట్ చేస్తున్నారు అభిమానులు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది