Mohan Babu : “మా” ప్రెసిడెంట్ రాకుండా సన్మానం చేయడమేంటి “RRR” కార్యక్రమం పై మోహన్ బాబు సీరియస్ వీడియో వైరల్..!!
Mohan Babu : తెలుగు వాడు గర్వించదగ్గ రీతిలో ప్రపంచ సినిమా రంగంలో ఎస్ఎస్ రాజమౌళి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం “RRR”. ఈ సినిమాకి ముందు “బాహుబలి” వచ్చి భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించిన గాని “RRR” అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది. పైగా ఆస్కార్ గెలవడం మరింత ప్లస్ అయింది. ఇదిలా ఉంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి ప్రపంచ సినిమా ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ “RRR” గెలవటంతో… ఇటీవల సన్మానం చేయడం తెలిసిందే. ఆస్కార్ అవార్డు గెలిచిన చంద్రబోస్, ఎంఎం కీరవాణి లను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందినవాళ్లు… తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం పై మోహన్ బాబు సీరియస్ వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో “మా” అధ్యక్షుడిగా విష్ణు… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేసినట్లు తాజాగా మోహన్ బాబు… సమావేశం పెట్టి తెలియజేశారు. “మా” అధ్యక్షునిగా విష్ణు గెలుపుని తట్టుకోలేక కొంతమంది చాలా కుయుక్తులు పన్నినా మేం పట్టించుకోలేదు. వాళ్లు కూడా బాగుండాలి అని మోహన్ బాబు పేర్కొన్నారు.
“మా” అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో కంటే ఇప్పుడు విష్ణు చాలా ఎక్కువ మంచి పనులు చేశారని ప్రశంసించారు. ఇంకా తన విద్యాసంస్థల గురించి వాటి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. వాటిని చర్చించుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు బయట వాళ్ళు ఎవరు రారు. ఏది ఏమైనా “మా” అధ్యక్షుడిగా విష్ణు ఇచ్చిన మాట ప్రకారం అనీ చేశారు. త్వరలో “మా” భవనం కూడా కడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోహన్ బాబు చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.
https://youtu.be/EzRF-cGvjHo