Mohan Babu : బాలకృష్ణ గురించి మోహన్‌బాబు ఏమన్నారో తెలుసా?
Mohan Babu : టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే విష్ణు ఆఫీసు బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆనవాయితీ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నెల 16న ఉదయం 11.45 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని విష్ణు మీడియాకు తెలిపారు.‘మా’ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని పలువురు సినీ ప్రముఖులను మంచు విష్ణు, తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్ కలిసిన వీరు తాజాగా నందమూరి నటసింహం బాలయ్యను కలిశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు బాలయ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ బాలయ్య సంస్కారం, విజ్ఞత గురించి పొగిడారు. 2019 సాధారణ ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించానని గుర్తు చేశారు డైలాగ్ కింగ్. ఈ క్రమంలోనే తాను బాలయ్య అల్లుడైన లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశానని తెలిపారు.
Mohan Babu : బాలయ్య అల్లుడిని ఓడించానన్న మోహన్ బాబు..
అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారని, అలా ఒకరకంగా తన అల్లుడి ఓటమికి కారణమైనప్పటికీ అవేవీ మనసులో పెట్టుకోకుండా బాలయ్య తన కుమారుడిని సపోర్ట్ చేశారని మోహన్ బాబు వివరించారు. ఇకపోతే విష్ణు బాలయ్యను ‘అఖండ’ మూవీ షూటింగ్ సెట్‌లో కలిసిన సంగతి తెలిసిందే. తనను తన తండ్రి ఎలాగైతే సపోర్ట్ చేశారో బాలయ్య కూడా అలానే సపోర్ట్ చేశారని విష్ణు తెలిపారు. తనకు సినీ ఇండస్ట్రీలోని పెద్దలందరి బ్లెస్సింగ్స్ కావాలని, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానిస్తామని విష్ణు తెలిపారు. ఇకపోతే ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక ఇంకా ఖరారు కాలేదని, అయ్యాక అందరికీ చెప్తామని మంచు విష్ణు పేర్కొన్నారు.