Home » Entertainment » Monal Gajjar About Abhijeet Fans Trolling
Entertainment

Monal Gajjar : తెరపైకి నాటి వివాదం.. అభిజిత్ ఫ్యాన్స్‌ను మళ్లీ గెలికిన మోనాల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 17, 2021, 4:38 pm
Advertisement

Monal Gajjar ,Abhijeet :బిగ్ బాస్ షో ముగిసింది కానీ నాటి వివాదాలు మాత్రం ఇంకా ముగియలేదు. నాల్గో సీజన్‌లో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైన కంటెస్టెంట్ మోనాల్. ఎక్కువగా జనాల నోళ్లల్లో నానింది కూడా మోనాల్. లవ్ ట్రాకులు, ముద్దులు, హగ్గులు, ఏడుపులు ఇలా అన్నింట్లోనూ మోనాల్ ఆరితేరింది. బిగ్ బాస్ టీం కూడా మోనాల్‌ను కాపాడేందుకు బాగానే ట్రై చేసింది. అలా ఆమెను చివరి వరకు తీసుకొచ్చారు.

Advertisement

Monal Gajjar about Abhijeet Fans Trolling

అయితే మోనాల్‌, ఆమె సోదరి హేమాలిపై ఆ మధ్య అభిజిత్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అభిజిత్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు.. బెదిరించారు.. రేప్ చేస్తామని ట్రోల్ చేశారు.. వాటిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని కూడా మోనాల్ చెప్పుకొచ్చింది. అంతటి వివాదం అయిపోయింది కూడా. కానీ తాజాగా మళ్లీ అదే విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది మోనాల్. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ నాటి విషయాన్ని ప్రస్థావించింది.

Advertisement

సోసల్ మీడియా నాపై బ్యాడ్ కామెంట్స్ : మోనాల్

సోసల్ మీడియా నా మీద వచ్చిన ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ కోసం నేను పట్టించుకోలేదు. ముఖ్యంగా నా డ్రెస్ కోసం.. ఎవరితోనో ఎఫైర్ ఉందంటూ ట్రోల్ చేశారు. నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదు.. దానిపై నేను ఎలా రియాక్ట్ కావాలి? నన్నే కాదు మా సిస్టర్‌ని కూడా చాలా బ్యాడ్‌గా ట్రోల్ చేశారు. నాకు చాలా బాధకలిగించింది. రేప్ చేస్తామని.. చంపేస్తామని.. బెదిరించారు. ఎందుకు అంటే ఆరోజు ఆమె బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పుడు అభిజిత్‌ని ఉద్దేశించి.. ఏదైనా ఉంటే మోనాల్ ముందు మాట్లాడు.. వెనుక మాట్లాడొద్దు అని ఒకే ఒక్క మాట అంది.. దాని కోసం అభిజిత్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అభిజిత్ నా గురించి ముందు మాట్లాడకుండా వెనుక మాట్లాడేవాడు. మా అక్క అన్నదాంట్లో తప్పేంలేదు. అయినా కూడా ఆమెను చాలా రకాలుగా బెదిరించారంటూ మోనాల్ చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి