Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ చరిత్రలోనే ముమైత్ ఖాన్ కి ఘోర అవమానం
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే కాకుండా దేశంలో ఇప్పటి వరకు అనేక భాషల్లో అనేక సీజన్లో బిగ్ బాస్ కార్యక్రమాలు జరిగాయి. కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క సీజన్లో కూడా ఒక సారి వచ్చిన వాళ్ళు మరో సారి రాక పోవడం మనం చూశాం. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం చిత్ర విచిత్రమైన సంఘటనలు.. విభిన్నమైన సంఘటనలు జరగడం మనం చూశాం. బిగ్ బాస్ మొదటి సీజన్లో ముమైత్ ఖాన్ కనిపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే రెండు సార్లు కారణంగా ఆమె బయటకు వెళ్లి మళ్ళీ లోనికి వచ్చింది. ఒకసారి బయటికి వెళ్ళిన వారు మళ్ళీ లోపలికి రావడం అనేది చాలా అరుదైన విషయంగా చెప్పుకుంటారు.
అసలు అలా రావడం సాధ్యం కాదని కూడా అంతా భావిస్తారు. కానీ ముమైత్ ఖాన్ కి ఆ విషయంలో ఉపశమనం లభించింది. బయటికి వెళ్ళిన ముమైత్ ఖాన్ కి లోనికి వెళ్లే అవకాశం ఈజీగానే దక్కింది. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ ఫారం సందడి చేసే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు ఎక్కువ అవకాశం రాకుండానే ఎలిమినేట్ అయింది. ఈసారి కూడా ఆమెకు అదృష్టం కలిసి వచ్చి వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. మళ్లీ ఆమెను దురదృష్టం వెంటాడింది.

Bigg Boss OTT Telugu nonstop mumaith khan again eliminated
ఈసారి కూడా కేవలం వారం రోజుల్లోనే ఆమె బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ముమైత్ ఖాన్ తన పద్ధతి మరియు తన యొక్క ప్రవర్తన కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది ఉంది. ఎప్పటికప్పుడు ఇంటి సభ్యులతో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు అనిపించినా కొందరికి ఆమె తో మాట్లాడాలంటే భయంగా ఉంటుంది. మాటలతో విరుచుకు పడ్డారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు భావించినట్లున్నారు అందుకే ఆమెను మళ్ళీ వెంటనే ఎలిమినేట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే రీఎంట్రీ ఇచ్చి మళ్లీ ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ కి ఇది ఘోర అవమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు.