Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ముమైత్‌ ఖాన్‌ కు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్‌ చేశారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ముమైత్‌ ఖాన్‌ కు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్‌ చేశారా?

 Authored By himanshi | The Telugu News | Updated on :7 March 2022,9:30 pm

Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్‌ నాన్ స్టాప్ నుండి మొదటి వారం ముమైత్‌ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. ఆమె ఎలిమినేషన్ ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించిన వెంటనే ఇంటి సభ్యులు అంతా కూడా అయోమయంకి గురి అయ్యారు. ఇది ఫేక్ ఎలిమినేషన్ అయి ఉంటుందని కొందరు భావించారు, మరి కొందరు మాత్రం ముమైత్‌ ఖాన్‌ కచ్చితంగా రీఎంట్రీ ఇస్తుందని నమ్మకంగా ఉన్నారు.

ఆమె పై నమ్మకం తో ఆమె ఉంటే ఎంటర్టైన్మెంట్, కంటెంట్ రెండు ఉంటాయి అనే ఉద్దేశంతో షో నిర్వాహకులు తీసుకు వచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమెను అనూహ్యంగా తొలగించడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముమైత్ ఖాన్ ఒక రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంటుంది. కనుక ఆమెకి మినిమం ఓట్లు వస్తాయి. ముమైత్ ఖాన్ తో పాటు పెద్దగా గుర్తింపు లేని మిత్ర కూడా నామినేషన్ లో ఉంది.మిత్ర కంటే ముమైత్ ఖాన్ కు తక్కువ ఓట్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం జనాలు కామెంట్ చేస్తున్నారు.

bigg boss nonstop first week elimination mumaith khan

bigg boss nonstop first week elimination mumaith khan

ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ విషయం లో అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రతి సీజన్లో కూడా ఇలాంటి అనుమానాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈసారి ముమైత్ ఖాన్ బలి అయింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ చేయనప్పుడు ఓటింగ్ నిర్వహించడం ఎందుకు అంటూ అసంతృప్తితో ప్రేక్షకులు ఉన్నారు. ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ కి సంబంధించిన విషయమై నెట్టింట పలు రకాల ప్రచారం జోరుగా సాగుతోంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది