Pawan kalyan : పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !
ప్రధానాంశాలు:
Pawan kalyan : పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ చుట్టూ వివాదం చెలరేగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఈ చిత్రానికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌కు ముంబై నుంచి సినీ కార్మికులను రప్పించిందని సమాచారం. దీంతో తెలుగులో పనిచేస్తున్న స్థానిక కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !
Pawan kalyan : ముంబై కార్మికులతో షూటింగ్
“మా వేతనాలు పెంచమంటే ముంబై నుండి కార్మికుల్ని తెప్పించడం ఏంటి? మా కష్టాలు పవన్ కళ్యాణ్‌కి కనిపించవా?” అంటూ సినీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 24 విభాగాల్లోని కార్మికులు పనిచేస్తున్న ఈ పరిణామం, ఇప్పుడే చలనం పొందుతున్న టాలీవుడ్ పునఃప్రారంభ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇకపోతే, టాలీవుడ్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి సినీ నిర్మాణ సంస్థలు, నిర్మాతల మండలి స్పందించాల్సిన అవసరం ఉందని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. స్థానిక కార్మికులకు న్యాయం జరగకపోతే, బంద్ మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ వివాదంపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గానీ, మైత్రి మూవీ మేకర్స్ గానీ అధికారికంగా స్పందించలేదు.