Samantha : నాలోని శ‌క్తి 50 శాతం త‌గ్గిపోయింది.. ఆ బాధ‌ని వ‌ర్ణించ‌లేనంటున్న స‌మంత‌… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha  : నాలోని శ‌క్తి 50 శాతం త‌గ్గిపోయింది.. ఆ బాధ‌ని వ‌ర్ణించ‌లేనంటున్న స‌మంత‌…

Samantha  : నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత కొన్ని రోజుల‌కి అత‌ని నుండి విడిపోయింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కి మ‌యోసైటిస్ బారిన ప‌డింది. దీంతో స‌మంత హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత ఏడాదిగా సినిమాలు చేయ‌క‌పోయిన ఆమె పేరు నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా స‌మంత పేరు తెరపైకి వ‌చ్చింది. యూట్యూబర్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న రీసెంట్‌గా ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha  : నాలోని శ‌క్తి 50 శాతం త‌గ్గిపోయింది.. ఆ బాధ‌ని వ‌ర్ణించ‌లేనంటున్న స‌మంత‌...

  •  ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉన్నా సోష‌ల్ మీడియాలోనో లేదంటే ఇంట‌ర్వ్యూస్ లేదంటే పాడ్ కాస్ట్‌తోనో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా స‌మంత పాడ్ కాస్ట్‌లో అప్పుడు త‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి వివ‌రించింది.

Samantha  : నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత కొన్ని రోజుల‌కి అత‌ని నుండి విడిపోయింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కి మ‌యోసైటిస్ బారిన ప‌డింది. దీంతో స‌మంత హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత ఏడాదిగా సినిమాలు చేయ‌క‌పోయిన ఆమె పేరు నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా స‌మంత పేరు తెరపైకి వ‌చ్చింది. యూట్యూబర్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న రీసెంట్‌గా ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని విడిపోవడానికి కూడా టెలిఫోన్ ట్యాపింగే కారణమని అన్నారు. అప్పటి అధికార పార్టీలోని కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం వల్లే వారిద్ద‌రు విడాకులు తీసుకొన్నారని కామెంట్ చేశారు.

అయితే పూర్తిగా వాస్తవాలు తెలుసుకున్న త‌ర్వాత దానిపై మరింత వివరంగా వీడియో చేస్తాను అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇక స‌మంత ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉన్నా సోష‌ల్ మీడియాలోనో లేదంటే ఇంట‌ర్వ్యూస్ లేదంటే పాడ్ కాస్ట్‌తోనో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా స‌మంత పాడ్ కాస్ట్‌లో అప్పుడు త‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితుల గురించి వివ‌రించింది. మయోసైటిస్ తర్వాత ఎదురయ్యే సైడ్ ఎఫక్ట్స్ ని అధికమించడానికి కూడా సమంతకి చాలా సమయం పట్టిందని తెలియ‌జేసింది. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే స‌మంత ఖుషి త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంది.

ఇక సిటాడెల్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ సెషన్ నిర్వహించ‌గా, ఆ ట్రైనింగ్ సెషన్ లో నా శక్తి సగానికి త‌గ్గిపోయింద‌ని తెలియ‌జేసింది. ఆ విష‌జ్ఞం అప్పుడు నాకు అర్థం అయింది. అయితే భారీ యాక్షన్ సీన్స్ లో నటించాల్సి రావ‌డం,ఒక‌వైపు మయోసైటిస్, మరోవైపు గాయాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయ‌ని తెలియ‌జేసింది. నా బాడీ త్వ‌ర‌గా హీల్ కావ‌డానికి త‌క్కువ ఆహారం తీసుకున్నాను. ఆ క్ర‌మంలో నా శ‌క్తి 50 శాతం ప‌డిపోయింది. చాలా రోజుల పాటు స‌మస్య‌ని ఎదుర్కొన్నా. కండ‌రాల నొప్పుల‌తో కూడా విప‌రీతంగా బాధ‌ప‌డ్డాను అని స‌మంత తెలియ‌జేసింది. అయితే స‌మంత ఇప్పుడు ఆ స‌మ‌స్య‌ల నుండి పూర్తిగా కోలుకొని త్వ‌ర‌లో తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది