Sudigali Sudheer : మల్లెమాలను వదిలి వచ్చిన సుడిగాలి సుధీర్.. నాగబాబు, ధన్ రాజు సెటైర్లు

 Authored By prabhas | The Telugu News | Updated on :29 June 2022,8:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మొత్తానికి ఈటీవీ, జబర్దస్త్, మల్లెమాలను వదిలేసి వచ్చాడు. ఎందుకు వచ్చాడన్నది ఎవ్వరికీ తెలియడం లేదు. మెల్లిమెల్లిగా ఒక్కో షో నుంచి బయటకు వచ్చాడు. ఒక్కో బంధనాన్ని విడిపించుకున్నాడు. అలా మొత్తానికి మొదట ఢీ నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఒకే సారి శ్రీదేవీ డ్రామా కంపెనీ మానేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి సుధీర్ వెళ్లడమే కాకుండా.. ఇంద్రజను కూడా బయటకు పట్టుకొచ్చినట్టున్నాడు. మొత్తానికి సుధీర్ మాత్రం ఇప్పుడు స్టార్ మాలో సందడి చేస్తున్నాడు.

సింగింగ్ షోలో అనసూయతో కలిసి సుధీర్‌ హోస్ట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సుధీర్ ఓ స్పెషల్ ఈవెంట్లో కనిపించాడు. పార్టీచేద్దాం పుష్ప అంటూ స్పెషల్‌గా చేస్తోన్న ఈ ఈవెంట్లలో సుధీర్ వచ్చాడు. ఇక నాగబాబు స్పెషల్ గెస్టుగా వచ్చేశాడు. అలా అక్కడ నాగబాబుని సుధీర్ చూడటం, సుధీర్‌ని నాగబాబు చూడటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వెల్కమ్ సార్.. అని సుధీర్ అంటే.. ఎవరు ఎవరికి స్వాగతం చెబుతున్నార్రా? అంటూ కౌంటర్ వేశాడు. ఇక ఇంకో స్కిట్లో నాగబాబు సెటైర్లు వేశాడు. ఓ స్కిట్లో భాగంగా లేడీ గెటప్ వేసిన యాదమ్మ రాజుతో తన స్టైల్లో మాట్లాడతాడు సుధీర్. ఈ పనులు చేయడానికే అక్కడి నుంచి ఇక్కడకు వచ్చావారా?

Naga Babu And Dhanraj Satires on Sudigali Sudheer In Party cheddham Pushpa

Naga Babu And Dhanraj Satires on Sudigali Sudheer In Party cheddham Pushpa

అని కౌంటర్ వేస్తాడు నాగబాబు. మరో స్కిట్లో ధన్ రాజ్ మరింత రెచ్చిపోతాడు. బిడ్డకు విడుదల.. బిడ్డకు విడుదల అంటూ సుధీర్ గురించి కౌంటర వేశాడు. బిడ్డకు విడుదల.. ఇకపై అంతా కళకళ అని కౌంటర్లు వేయడంతో సుధీర్ పగలబడి నవ్వేస్తాడు. మొత్తానికి మల్లెమాలను మాత్రం ఓ రకంగానూ వదలడం లేదు. సుధీర్ ఎందుకు వచ్చేశాడన్నది మాత్రం అందరికీ సస్పెన్స్‌గా ఉంది. ఊపిరి ఉన్నంత వరకు జబర్దస్త్ షోను, మల్లెమాలను వదిలి పెట్టను అని చెప్పిన సుధీర్.. మొత్తానికి స్టార్ మా పంచెన చేరాడు. మరి సుధీర్‌కి మల్లెమాలకు ఎక్కడ చెడిందో ఏమో గానీ.. మొత్తానికి ఆ చానెల్‌కు దూరంగా వచ్చేశాడు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి