Nagababu : ‘మా ‘లో మ‌ళ్లీ గొడ‌వ‌లు… మా డ‌బ్బును వృథా చేశారు.. బాల‌య్య వ్యాఖ్య‌ల‌కు నాగ‌బాబు కౌంట‌ర్..!

Authored By vamana sai | The Telugu News | Updated on: July 17, 2021, 12:42 pm

Nagababu : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికల వేడి మొదలైంది. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ ఉంటే ఇప్పటి నుంచే పదవి కోసం పోటీ పడి ఒకరిని ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్. ఇటీవలే పలువురు ప్రముఖులు తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో కూడా ప్రత్యేకంగా వెళ్లడించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మా లో జరుగుతున్న అనేక విషయాలను తవ్వి తీస్తున్నారు.

Naga babu Counter on Balakrishna

Naga babu Counter on Balakrishna

ఆ విషయాల వల్ల ఇరు బృందాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన పలు విషయాల గురించి నందమూరి బాలకృష్ణ  Balakrishnaస్పందిస్తూ ఏకగ్రీవం చేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దానికి ముందు ఇదే విషయాన్ని హీరో మంచు విష్ణు తెలిపాడు. దాంతో తాజాగా ఈ విషయమై మెగా బ్రదర్ నాగబాబు Naga babu స్పందించారు. చాలా కాలంగా ‘మా’ ఎన్నికలు అంటే ఇద్దరు ముగ్గురు ప్రముఖులు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. కానీ, ఈ సారి ఐదుగురు నటీనటులు ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు.

Nagababu : మా బిల్డింగ్‌ నిర్మాణానికి తానే సొంత డబ్బులు ఇస్తానని ప్రకటించాడు.

ముందుగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీలో నిలబడనున్నట్టు ప్రకటించగా ఆ తర్వాత జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీ పడబోతున్నట్టు అనూహ్యంగా ప్రకటించారు. కాగా బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావిస్తూ మా బిల్డింగ్‌ నిర్మాణానికి తానే సొంత డబ్బులు ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరాడు. ఈ సందర్భంగా ఎన్నికను ఏకగ్రీవం చేస్తే తప్పుకుంటానని కూడా వెల్లడించాడు.

Balakrishna About on maa association building

Balakrishna About on maa association building

కాగా ఈ గురువారం బాలయ్య దీనికి స్పందించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించకూడదు అంటూనే కొందరు ధనాన్ని వృథా చేశారంటూ బాలయ్య విమర్శించారు. అదే సమయంలో బిల్డింగ్ కోసం మంచు విష్ణుకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. దాంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకోవడం అంత మంచి నిర్ణయం కాదని అన్నారు. ఎవరిని ఎన్నుకోవాలన్నది మా సభ్యులు నిర్ణయించాల్సింది. కాబట్టి తప్పకుండా ఎన్నికలు జరగాల్సిందే. వీరిలో ది బెస్ట్ పర్సన్ ఎవరో వాళ్లే గెలవాలి’ అని తన అభిప్రాయాన్ని సూటిగా తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు.. అస‌లు కార‌ణం ఇదే.. బాలకృష్ణ

ఇది కూడా చ‌ద‌వండి ==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!

ఇది కూడా చ‌ద‌వండి ==> నీలో నాకు న‌చ్చింది అదే.. ర‌ష్మీపై ఓంకార్ కామెంట్స్ వీడియో వైర‌ల్..!

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp