Naga Babu : జెమినీ టీవీ కి వెళ్లినా నాగబాబుకి లక్కు కలిసి రాలేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Babu : జెమినీ టీవీ కి వెళ్లినా నాగబాబుకి లక్కు కలిసి రాలేదు

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2022,7:00 pm

Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు బుల్లి తెరపై జబర్దస్త్ కార్యక్రమం తో మంచి గుర్తింపు ని సొంతం చేసుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు ఐదు సంవత్సరాల పాటు నాగబాబు కార్యక్రమం లో జడ్జిగా వ్యవహరించి మంచి పేరు సంపాదించి డబ్బులను కూడా వెనక్కి తీసుకున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ మల్లెమాల వారితో గొడవలు వచ్చి జబర్దస్త్ నుండి తప్పుకున్నట్లు గా ప్రకటించాడు.

ఈటీవీ నుండి తప్పుకున్న నాగబాబు ఆ తర్వాత జీ తెలుగు స్టార్ మా మరియు జెమిని టీవీలో కూడా వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఉగాది సందర్భంగా ప్రతి ఒక్క టెలివిజన్ కూడా ఉగాది స్పెషల్ కార్యక్రమాలను నిర్వహించాయి, అందులో భాగంగా జెమినీ టీవీ లో టెలికాస్ట్ అయిన కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నాడు. జబర్దస్త్ పాత కామెడియన్స్ ను తీసుకు వెళ్లి జెమినీ టీవీ లో సందడి చేసే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎప్పటిలాగే నాగబాబు కు నిరాశ తప్పలేదు.

Naga Babu dont get success at gemini tv also

Naga Babu dont get success at gemini tv also

జెమినీ టీవీలో ప్రసారమైన ఉగాది స్పెషల్ కార్యక్రమాన్ని ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో నాగబాబు కి మళ్లీ నిరాశ తప్ప లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగబాబు ఇలా పదే పదే తన పరువు తాను తీసుకోవడం కంటే బుల్లి తెరకు దూరం అయితేనే బెటర్ అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగో సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి కనుక వరుసగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు. జెమినీ టీవీ కాదు ఏ టీవీ కి వెళ్ళినా కూడా నాగబాబు సక్సెస్ అవ్వడం సాధ్యం కాదు అనేది కొందరి అభిప్రాయం.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి