Naga Babu : భయంకరంగా మారిన నాగబాబు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Naga Babu : మెగా బ్రదర్ బ్రదర్ నాగబాబు ఈ మధ్య తన లుక్కును వెరైటీగా మార్చేస్తున్నాడు. ఈ మధ్య గడ్డం పెంచుతూ, పెయింటింగ్స్ వేస్తూ రకరకాల వ్యాపాకాలతో బిజీగా ఉన్నాడు. అసలే సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఆడుకునే నాగబాబు ఈ మధ్య కాస్త సైలెంట్ అయిపోయాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో నాగబాబు మేకప్, లుక్కు చూస్తే అతి కిరాతకుడిగా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోతో పాటు నాగబాబు ఓ కొటేషన్‌ను కూడా షేర్ చేశాడు.
Naga Babu : భయంకరంగా మారిన నాగబాబు..
ఓ మనిషిలోని క్రూరత్వం అతను కనిపించే విధానంలో ఉండదు.. నిజం ఏంటంటే అతని స్వేచ్చకు మీరు ఎంత భంగం కలిగిస్తారు.. అతని ప్రవర్తనపై మీరు ఎలా స్పందిస్తారు అనేదే క్రూరత్వం.. కోపం అంటే నేను ఎలా కనిపిస్తానో కాదు.. ఎలా రియాక్ట్ అవుతానో అనేదే కోపం అంటూ తన స్టైల్లో ఓ కొటేషన్‌ను పెట్టాడు. మొత్తానికి నాగబాబు ఈ కొత్త లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఇక్కడే అందరికీ కొన్ని అనుమానాలు వస్తున్నాయి.

Naga babu new look goes viral
నాగబాబు ఏదో సరదా కోసం ఇలా రెడీ అయ్యాడా? లేదా ఏదైనా సినిమాలోని లుక్కును ఇలా రివీల్ చేశాడా? అన్నది తెలియడం లేదు. మామూలుగా అయితే నాగబాబు ఇప్పుడు బుల్లితెర, వెండితెరపై ఎలాంటి ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పలేదు. పైగా తన యూట్యూబ్ చానెల్‌ను ప్రమోట్ చేసుకునే పనిలోనే బిజీగా ఉన్నాడు. మరి ఈ లుక్కు దేని కోసమబ్బా అంటూ నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు. ఏది ఏమైనా కూడా నాగబాబు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు.