Jabardasth Avinash : నీ కాపురం పాడుచేయను… అవినాష్ పరువు తీసిన నాగబాబు
Jabardasth Avinash : బుల్లితెరపై నాగబాబు కనిపించి చాలా రోజులే అవుతోంది. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు.. అదిరింది షోతో కొన్ని రోజులు రచ్చ చేశాడు. ఆ తరువాత అదిరిందిని కాస్తా బొమ్మ అదిరిందిగా మార్చారు. అందులో జగన్ మీద చేసిన స్కిట్లు ఏపీలో ప్రకంపనల సృష్టించాయి. దీంతో దెబ్బకు ఆ షోనే ఎగిరిపోయింది. అలా అప్పటి నుంచి నాగబాబు బుల్లితెరకు దూరంగా ఉండిపోయాడు.
తన యూట్యూబ్ చానెల్‌ను నాగబాబు నడిపించుకుంటూ పోయాడు. ఇక ఇప్పుడు నాగబాబు మళ్లీ కామెడీ స్టార్స్ షోలోకి వచ్చాడు. కామెడీ స్టార్స్ ధమాకా అంటూ కొత్తగా మార్పులు చేర్పులు చేశారు. ఇందులో నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా, దీపిక పిల్లి యాంకర్‌గా ఉంటున్నారు. ఇక పాత కమెడియన్లంతా కూడా మళ్లీ ఇందులోకి వచ్చారు. అవినాష్ అయితే ఏకంగా తన భార్యను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చాడు.

Naga babu Satires On Avinash Anuja Personal Life
Jabardasth Avinash : అవినాష్ కాపురంపై నాగబాబు..
అవినాష్ స్కిట్లో భాగంగ ఓ డైలాగ్ కొడతాడు. ప్రేమ అనే పదం నిన్ను చూశాకే తెలిసింది.. నా మీద నమ్మకం లేకపోతే నాగబాబు గారిని అడగండని అంటాడు. ఏరా అన్నీ చెప్పమంటావా? అని నాగబాబు కౌంటర్ వేస్తాడు. నా మీద మీకు ప్రేముంటే.. పది మార్కుల బోర్డు ఎత్తండి కానీ నా బ్యాక్ గ్రౌండ్ మాత్రం తీయకండి అని వేడుకుంటాడు. నీ కాపురం పాడు చేయనులేరా అని నాగబాబు సెటైర్ వేస్తాడు.
Full of fun with 100%clean entertainment… #comedystarsdhamaka every Sunday at 12:00 pm on #starmaa
.#Beమాsked #SundayFunday pic.twitter.com/VOcqCrPYq2— starmaa (@StarMaa) January 25, 2022