Naga Chaitanya : ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన నాగచైతన్య..

Authored By aruna | The Telugu News | Published on: August 14, 2022, 7:40 pm

Naga Chaitanya : అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరో నాగచైతన్య గురించి తెలియని వారుండరు. కెరీర్‌ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ప్రకటించారు.

Naga Chaitanya : చైతన్య తొందరపడటమే కారణామా..

ఆ తర్వాత ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా మారిపోయారు.సమంత తన లైఫ్‌ను బిందాస్‌గా ఎంజాయ్ చేస్తోంది. వరుస బెట్టి సినిమాలు చేస్తూ అటు బాలీవుడ్, కోలివుడ్, టాలీవుడ్‌లో దుమ్మురేపుతోంది. ఇక చైతూ కూడా తన వర్క్ విషయంలో గుట్టుచప్పుడు కాకుండా మూవీస్ ఫినిష్ చేస్తున్నాడు. అయితే, చైతూ సామ్ మ్యారేజ్ కాకముందు కాలేజీ చదివే రోజుల్లో నాగచైతన్య ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపినట్టు తెలిసింది.ఈ విషయాన్ని లాల్ సింగ్ చద్దా ప్రమోషన్‌లో భాగా చైతూనే స్వయంగా వెల్లడించారు.

Naga Chaitanya, Arested By Polise With His GF..

Naga Chaitanya, Arested By Polise With His GF..

ఇంటర్వ్యూవర్ అడిగి ప్రశ్నకు నేను నా గర్లఫ్రెండ్ ల్ చేసిన పనికి పోలీసులు పట్టుకున్నారని చెప్పాడు. తాను హైదరాబాద్‌లోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నప్పుడు నేను నా ప్రేయసికి బహిరంగంగా ముద్దుపెట్టాను. పక్కనే ఆపి ఉన్న నా కారు వెనుక సీటులో నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు. తామిద్దరం క్లో‌జ్ గా మాట్లాడుకుంటున్న టైంలో పోలీసులు వచ్చి అడిగారు. నన్ను ఏకంగా పట్టుకున్నారు. దాంతో చాలా భయం వేసింది. అప్పటి నుంచి ఇంతరకు మళ్లీ ఇలాంటి పనులు చేయలేదని చైతూ చెప్పుకొచ్చాడు. ఇక అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడితో షేర్ చేసుకోవడం జరిగింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp