Naga Chaitanya: నాగ చైతన్య మాములోడు కాదు.. సమంతతో పెళ్లికి ముందు ఎఫైర్స్ ఉండేవట…!
Naga Chaitanya : నాగ చైతన్య- సమంత కొన్నాళ్లపాటు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఊహించని విధంగా గత ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి సమంత, నాగ చైతన్యకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. సమంత, చైతన్యలు విడిపోయినప్పటికి.. వీరద్దరికి సంబంధించి నిత్యం ఏదో వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా నాగచైతన్యకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది.
Naga Chaitanya : చైతూపై పుకార్లు..
సమంత కన్నా ముందు చై.. ఓ స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరీ ఏం జరిగిందో తెలియదు కానీ వారి ప్రేమ పెళ్లి పీటలు ఎక్కలేదనేది వార్త సారంశం. మరి చై అంత గాఢంగా ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే.. విలక్షణ నటడు కమల్‌హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ అట. చై, శ్రుతి హాసన్‌లకు 2013లో పరిచయం ఏర్పడింది. 2017లో చై, శ్రుతి హాసన్‌తో డేటింగ్ చేశాడట. శ్రుతి, చైతన్యల మధ్య సిరీయస్ రిలేషన్ కొనసాగిందని.. ఒకానొక సమయంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారట. కాని ఎందుకో అది జరగలేదు. అయితే వీరద్దరూ కలిసి 2018లో విడుదలైన ప్రేమమ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
సమంతతో విడాకుల తరవాత కూడా హీరోయిన్ శోభితతో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ ఓకే ఫ్లాట్ లో ఉన్నారని కూడా టాక్ వినిపించింది. కానీ చైతూ ఆ వార్తల్ని ఖండించాడు. శోభిత కూడా ఇన్‌డైరెక్ట్‌గా ఈ వార్తలపై సీరియస్ అయింది. మరోవైపు సమంతపై కూడా తప్పుడు వార్తలు రాగా, వాటిని ఖండించారు. మొత్తానికి వారు ఇటీవలి కాలంలో ఏదో ఒక న్యూస్‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నారు.