Naga Chaitanya is in dire straits
Naga Chaitanya : టాలీవుడ్ పాపులర్ హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఆయన నటించిన లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో చైతూ తర్వాతి చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్‌గా థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసింది. నాగ చైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థాంక్యూ నిలిచింది తన ఎదుగుదలకు కారణమైన వారికి కృతజ్ఞత చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల లో విడుదలైన భారీ చిత్రాల్లో థాంక్యూ ఒకటి కావడంతో నాగచైతన్య సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది.
లీజ్ రోజు నుంచి చాలా డల్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి రాలేదు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 3.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో నుంచి ఈ సినిమాని తీసేశారు. చైతు – దిల్ రాజు మరియు విక్రమ్ కుమార్ సినీ కెరీర్‌లలోనే ఈ చిత్రం అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే, ఈ సినిమా డిజాస్టర్స్ లిస్ట్ లో కూడా ప్లేస్ సంపాదించింది. సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ఈ సినిమా వస్తోందని ఊహించలేదు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Naga Chaitanya is in dire straits
ఇక నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని అందుకుని లాంగ్ రన్ లో ఒకటి తర్వాత ఒకటి వరుస పెట్టి సక్సెస్ లుగా నిలిచాయి. కానీ ఆ ఇంపాక్ట్ ఏమి కూడా థాంక్యూ సినిమా మీద పడలేదు… సినిమాకి అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడలేదు. దానికి తోడూ రిలీజ్ రోజు వర్షాల ఇంపాక్ట్ కూడా పడింది. దాతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ వరకు కూడా ఏవి లేవు. రీసెంట్ టైమ్ లో నాగ చైతన్య కెరీర్ లోనే లో వరస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా సొంతం చేసుకుంది.దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దిల్‌రాజు సంస్థలో నాగచైతన్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖన్నా, మాళవికానాయర్, అవికాగోర్ హీరోయిన్లుగా నటించారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.