Janhvi Kapoor: నా చెల్లెలు గురించి త‌ప్పుగా మాట్లాడితే తాట తీస్తానంటూ జాన్వీ క‌పూర్ వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor: నా చెల్లెలు గురించి త‌ప్పుగా మాట్లాడితే తాట తీస్తానంటూ జాన్వీ క‌పూర్ వార్నింగ్

 Authored By sandeep | The Telugu News | Updated on :20 July 2022,9:00 pm

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇటీవ‌ల తెగ హాట్ టాపిక్ అవుతుంది. ఎప్పుడు హాట్ అందాలను ఆర బోస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచే ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా అభిమానుల పై ఫైర్ అవుతూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. రీసెంట్‌గా జాన్వీని న‌య‌న‌తార‌తో పోల్చారు కొంద‌రు. దానికి స్పందించిన జాన్వీ.. ‘నయనతార లాంటి గొప్ప స్టార్‌ హీరోయిన్ తో నన్ను పోల్చడం చాలా హ్యాపీ . ఆమె దక్షిణాదిలో తిరుగులేని నటి. ఆమెతో పోల్చడం బాగానే ఉంది. కానీ నిజాయతీగా చెప్పాలంటే మీ ఈ కంపేరిజన్ నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. ఆమె నటించిన సినిమాను నాతో రీమేక్‌ చేశారు మేకర్స్ అంతే. దానికే ఇలా చేయడం..చాలా ఇబ్బందిగా ఉంది”..అంటూ చెప్పుకొచ్చింది.

Janhvi Kapoor: త‌గ్గేదే లే..

ఇక త‌న చెల్లి విష‌యంలో మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. శ్రీదేవి-బోనీక‌పూర్ రెండో కూతురు ఖుషీక‌పూర్ కూడా జోయా అఖ్త‌ర్ తెర‌కెక్కిస్తున్న ది ఆర్చీస్ తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే త‌న సోద‌రి వ‌ర్క్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీక‌పూర్. నేను ఆమె (ఖుషీ క‌పూర్‌) ప‌ని చూశాను. చాలా క‌ఠినంగా హార్డ్‌వ‌ర్క్ చేస్తుంది. ఆమె డెడికేష‌న్ చూసి చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఖుషీనుద్దేశించి ఎవ‌రైనా ఎలాంటి ట్రోలింగ్స్ నైనా చేస్తే స‌మ‌ర్థించ‌బోనంటోంది జాన్వీక‌పూర్‌.

janhvi kapoor supports to her sister

janhvi kapoor supports to her sister

ఖుషీ గురించి ఎవ‌రైనా ఏదైనా చెడుగా మాట్లాడితే..వారి తాట తీస్తానంటోంది. కాగా, స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన అందం, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ వరుస సినిమా ఆఫర్లతో ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ కుర్ర హీరోయిన్ ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే.. మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు. ఇటీవ‌ల క‌ర‌ణ్ జోహార్ షోలో జాన్వీ, సారా హంగామా చేశారు. వీరిద్దరితో కరణ్ జోహార్ రచ్చ చేశారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది