naga chaitanya starts food business
Naga Chaitanya: అక్కినేని నాగార్జున ముద్దుల తనయుడు నాగ చైతన్య ప్రస్తుతం ఫుల్ బిజీగా మారాడు. సమంత నుండి విడాకులు తీసుకున్న తర్వాత చైతూ ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. కేవలం హీరోయిజానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా రాణించాలని భావిస్తున్నాడు నాగ చైతన్య. తండ్రి నాగార్జునలాగే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అక్కినేని ఫ్యామిలీ ఇప్పటి వరకు చాలా రకాల వ్యాపారాలు చేసినా ఫుడ్ బిజినెస్‌లోకి మాత్రం ఎంటర్ కాలేదు. కానీ చైతూ మాత్రం ఇదే రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
చై హైదరాబాద్‌లో ‘సోయు’ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టి తెలిపారు. ఇది చూసిన విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రిత ..‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా’ అంటూ చైతూ పెట్టిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ విషెస్ తెలిపింది. ఇక నాగ చైతన్య అభిమానులు ఈ సందర్భంగా విషెస్ తెలుపుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరు ఇలా ఫుడ్ బిజినెస్‌లోకి లేదంటే థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెడుతుండడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
naga chaitanya starts food business
ఇక చైతూ విషయానికి వస్తే గత ఏడాది లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకులని అలరించిన నాగ చైతన్య ఈ ఏడాది సంక్రాంతికి తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో వరుసగా సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు చైతు.దిల్ రాజు నిర్మాణంలో విక్రం కె కుమార్ దర్శకత్వంలో చైతు-రాశిఖన్నా జంటగా నటించిన ‘థాంక్యూ’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. మరి కొన్ని ప్రాజెక్టులు కూడా చైతూ ఖాతాలో ఉన్నాయి. మొత్తానికి క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేందుకు చైతూ ప్లాన్ చేసుకుంటున్నాడు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.