Akhil : అఖిల్ పెళ్లి కాదని ఎప్పుడో చెప్పా.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Akhil : అఖిల్ పెళ్లి కాదని ఎప్పుడో చెప్పా..

Naga chaithanya: సినీ తారల జీవితాలకి గుట్టు అనేది ఉండదని ఈ మధ్య అదేపనిగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక క్రేజీ స్టార్ కపుల్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని మీడియా సంస్థలు అవకాశం ఉంటే ఎంత లోపలికైనా వెళ్ళి ఉన్నది లేనిది కలిపి వార్తలు సృష్ఠించి జనాల మీదకి వదిలేస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప వేరే ఉద్దేశ్యం లేదనేది అందరికీ తెలిసిందే. అయినా సినీ తారల జీవితాలు కాబట్టి అదో ఉబలాటం. అసలు వాస్తవాలు […]

 Authored By govind | The Telugu News | Updated on :25 September 2021,8:50 am

Naga chaithanya: సినీ తారల జీవితాలకి గుట్టు అనేది ఉండదని ఈ మధ్య అదేపనిగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక క్రేజీ స్టార్ కపుల్‌కి సంబంధించిన వార్తలు చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని మీడియా సంస్థలు అవకాశం ఉంటే ఎంత లోపలికైనా వెళ్ళి ఉన్నది లేనిది కలిపి వార్తలు సృష్ఠించి జనాల మీదకి వదిలేస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప వేరే ఉద్దేశ్యం లేదనేది అందరికీ తెలిసిందే. అయినా సినీ తారల జీవితాలు కాబట్టి అదో ఉబలాటం. అసలు వాస్తవాలు ఎవరీకి అవసరం లేదు. ఏదో ఊహించుకొని అనేసుకుంటే అదో తృప్తి. ఇప్పుడు సోషల్ మీడియాలో అమంత – నాగ చైతన్య ల విడాకుల విషయం కూడా ఇలాగే మారింది.

naga chaithanya samantha will not be together

naga-chaithanya-samantha will not be together

సమంత గానీ, నాగ చైతన్య గానీ మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని గానీ..విడిపోవాలనుకుంటున్నామని గానీ అధికారకంగా వెల్లడించలేదు. ఇటు చైతు ఫ్యామిలీ నుంచి నాగార్జున గానీ, అటు సమంత ఫ్యామిలీ నుంచి గానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. కానీ చాలామంది వీరు విడాకులు తీసుకుంటున్నారని ఫిక్సైపోయారు. కొందరు జాలి చూపిస్తుంటే, కొందరు సినీ తారలకి ఇది కామనే అంటున్నారు. ఇక్కడ కాస్త మైండ్ పెట్టి ఆలోచిస్తే ప్రపంచంలో నిజంగా విడిపోవాలనుకుంటే అది సమంత – నాగ చైతన్యనే నా ..రోజుకి కోర్టుల చుట్టూ కొన్ని వేల కేసులు ఇలాంటివే. కానీ అందరికీ వీరి మ్యాటరే కావాలి.

Naga chaithanya: నాగ చైతన్య, సమంత జాతకం నా దగ్గర ఉంది. మూడేళ్ల క్రితమే వీళ్ల గురించి ఇంటర్వ్యూలో చెప్పాను.

తాజాగా కూడా దీనికి సంబంధించిన మరో కొత్త వార్త వచ్చి నెట్టింట షికారు చేస్తోంది. ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి స్పందించారట. మూడేళ్ల క్రితమే ఆయన వీళ్ల జాతకం చెప్పానంటూ షాకింగ్ కామెంట్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య, సమంత జాతకం నా దగ్గర ఉంది. మూడేళ్ల క్రితమే వీళ్ల గురించి ఇంటర్వ్యూలో చెప్పాను. గతంలో తాను ఏం చెప్పానో ఆ వీడియో చూడండని అన్నారు వేణు స్వామి. సమంత – నాగ చైతన్య విడిపోతారని అందుకు కారణం సంతానం అని చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి. అందుకు కారణం సమంత అమావాస్య నాడు పుట్టడమేనట.

ప్రొఫషనల్‌గా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉండవని పర్సనల్ లైఫ్‌లోనే సమస్యలు వస్తాయని ఆయన చెప్పారట. అలాగే అఖిల్‌కి కూడా కేవలం ఎంగేజ్‌మెంట్ మాత్రమే అవుతుందని, పెళ్ళి క్యాన్సిల్ అవుతుందని చెప్పినట్టు వేణు స్వామీ మరోసారి వార్తల్లో నిలిచాడు. మరి ఇది నిజమా కాదా అనేది ఆయన గతంలో చెప్పీ వీడియోలు ఏవైనా చూస్తే క్లారిటీ వస్తుంది. చూడాలి మరి అక్కినేని ఫ్యామిలీ వారు ఎలా స్పందిస్తారో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది