Nagarjuna : రాజమండ్రి నుంచి తెప్పించాను రా అన్నాడు.. చిరుపై నాగ్ కామెంట్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nagarjuna : రాజమండ్రి నుంచి తెప్పించాను రా అన్నాడు.. చిరుపై నాగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. అలా ఈ ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉంటాయి. నాగ్ చిరు సోదరభావంతోనే ఉంటారు. అందుకే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్స్‌కు నాగ్ పిలిచిన వెంటనే చిరంజీవి గెస్ట్‌గా వస్తుంటాడు. అయితే ఈ మధ్య చిరు నాగ్ కలిసి ఉన్న ఓ ఫోటో ఒకటి వైరల్ అయింది. చిరు ఇంటి వంట గదిలో నాగ్ సందడి […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :4 April 2021,11:45 am

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. అలా ఈ ఇద్దరి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉంటాయి. నాగ్ చిరు సోదరభావంతోనే ఉంటారు. అందుకే బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్స్‌కు నాగ్ పిలిచిన వెంటనే చిరంజీవి గెస్ట్‌గా వస్తుంటాడు. అయితే ఈ మధ్య చిరు నాగ్ కలిసి ఉన్న ఓ ఫోటో ఒకటి వైరల్ అయింది. చిరు ఇంటి వంట గదిలో నాగ్ సందడి చేశాడు. వైల్డ్ డాగ్ ప్రీమియర్ సందర్భంగా నాగ్ టెన్షన్‌లో ఉన్న సందర్భంలో చిరు ఫోన్ చేశారట.

Nagarjuna : రాజమండ్రి నుంచి తెప్పించాను రా అన్నాడు.. చిరుపై నాగ్ కామెంట్స్

వైల్డ్ డాగ్ ప్రీమియర్ కోసం ఇంట్లో అందరూ వెళ్లిపోయారు. నేను ఒక్కడిని మాత్రమే ఒంటరిగా ఉన్నాను. ప్రతీ సినిమా ఇప్పుడు ఇలాంటి సందర్బం వస్తుంది. అలాంటి సమయంలోనే చిరంజీవి గారు ఎందుకో ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావ్ నాగ్.. ఈవినింగ్ ప్లాన్ ఏంటి? అని అన్నారు. ఏమీ లేదండి.. ప్రీమియర్ కదా? అందరూ వెళ్లిపోయారు.. ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను అని సమాధానం ఇచ్చాను. అయితే నా ఇంటికి రా.. రాజమండ్రి నుంచి ఇప్పుడే చేపలు తెప్పించాను అని అన్నారు.

Nagarjuna about Chiranjeevi special dish

Nagarjuna about Chiranjeevi special dish

ఆయన అలా పిలవడంతో వెంటనే వెళ్లిపోయాను. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. పాత సినిమాల గురించి ముచ్చట్లు పెట్టుకున్నాం.. హిట్లు ఫ్లాపుల గురించి మాట్లాడుకున్నాం.. ఆయన ఎంతో బాగా వంట చేశారు.. అదిరిపోయింది అంటూ చిరుపై నాగ్ తన ప్రేమనంతా ప్రకటించేశాడు. మొత్తానికి చిరు వంటకాన్ని నాగ్ టేస్ట్ చేసేశాడు. అసలే చిరు వంట వండటంలో చేయి తిరిగిన వాడు. చిరు వంటల నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే. చిరు దోశలు వేయడంలో స్పెషలిస్ట్.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది