
nagarjuna and akkineni amala interesting box office war
Nagarjuna : ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ వద్దకు పలు సినిమాలు వచ్చాయి. అందులో బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ మరియు టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటించిన కూడా సినిమా కు కొద్దిలో కొద్దిగా ప్లస్ కాలేక పోయారు. నాగార్జున పాత్ర మరీ నాసిరకంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అక్కినేని అభిమానులు అసలు నాగార్జున ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో నేడు విడుదలైన మరో సినిమా శర్వానంద్ నటించిన ఒకే ఒక్క జీవితం. ఈ సినిమా లో కీలక పాత్రలో నాగార్జున భార్య అక్కినేని అమల నటించిన విషయం తెలిసిందే. సినిమాలో ఆమె పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమా హిట్ టాక్ అని దక్కించుకుంది. దాంతో బ్రహ్మాస్త్ర కంటే ఒకే ఒక జీవితం సినిమాకి మంచి వసూలు నమోదు అవుతున్నాయని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
nagarjuna and akkineni amala interesting box office war
ఈ రెండు సినిమాల్లో శర్వానంద్ సినిమా పై చేయి సాధించడంతో ఇప్పుడు ఈ బాక్సాఫీస్ పోటీలో నాగార్జున ఓడిపోయాడు అక్కినేని అమల గెలిచింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై కొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ అమల ఇక నుండి వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో నాగార్జున మళ్ళీ హిందీలో నటించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకేరోజు భార్యాభర్తలు సినిమాలు రావడం.. అందులో భర్త నాగార్జున సినిమా ఫ్లాప్ అవడం, భార్య అమల అక్కినేని సినిమా సక్సెస్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ అంశంగా మారింది.
IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్పూర్…
Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 22 టుడే ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో…
AP Pasu Bima Scheme 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా ఆవులు,…
Onions for Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మారుతున్న…
Pressure Cooker : ఇళ్లలో వంట పనిని సులభం చేసిన అద్భుతమైన పరికరం ప్రెషర్ కుక్కర్. తక్కువ సమయంలో వంట…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
This website uses cookies.