Health Benefits : మనం శరీరం బలంగా ఉండాలని వివిధ ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి సరిగ్గా ఉండాలంటే ఆహారంలో అనేక పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అందులో ముఖ్యంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, విటమిన్స్. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కొవ్వులు, ఫైబర్. ఇవన్నీ రోజు తినే ఆహారంలో కచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి వీటన్నింటిని కలిపి వండితే కిచిడి అవుతుంది. ఈ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కొద్దిగా కొర్రలను తీసుకోవాలి. దీనిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా చేస్తాయి. తర్వాత గుప్పెడు పెసరపప్పు తీసుకోవాలి. దీంతోపాటు పచ్చి బఠాణి తీసుకోవాలి.
సోయా చిక్కుడు నానబెట్టి వేసుకోవచ్చు. వీటితోపాటు స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకోవాలి. ఇందులో ప్రొటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్, ఉంటాయి. ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఉడకడానికి నీటికి బదులుగా నాలుగైదు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని వడకట్టుకొని జ్యూస్ లాగా తీసుకోవాలి. దీంతోపాటు తోటకూరగాని, పాలకూర గాని, చుక్కకూర గాని, గోంగూర గాని, బచ్చల కూరగాని ఏదో ఒక ఆకుకూర వేయాలి. సూక్ష్మ పోషకాల కోసం ఈ ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలో ఐరన్, క్యాల్షియం, జింక్, ఫాస్పరస్ మొదలైనవి ఉంటాయి. దీంతోపాటు క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు కొన్ని వేసుకోవాలి.
అలాగే బీన్స్ ముక్కలు, క్యాప్సికం మొక్కలు వీటితోపాటు ఇంకేమైనా కూరగాయలను తీసుకోవచ్చు. కావలసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి వీటన్నింటిని కుక్కర్లో పెట్టుకోవాలి. వీటిని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము గాని పైన చల్లుకోవాలి. కొద్దిగా మీగడవేసి తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇందులో అవిసె గింజల కారం పొడి గాని వేరుశనగల కారంపొడిగా కలుపుకొని తినొచ్చు. ఇలా తింటే అన్నం వండుకోవాల్సిన అవసరం ఉండదు. కావాల్సిన పోషకాలాన్ని శరీరానికి అందుతాయి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.