Nagarjuna : టాలీవుడ్ లో వస్తున్న గ్రాఫిక్స్ సినిమా లు అంతర్జాతీయ స్తాయిలో విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. మన రాజమౌళి చేయించిన గ్రాఫిక్స్ వర్క్ కు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వారు కూడా వావ్ అంటున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మన సినిమాల గ్రాఫిక్స్ వర్క్ ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ సినిమాల గ్రాఫిక్స్ వర్క్ అంతకు మించి ఉండాలి. కానీ హిందీ లో ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ ఒక్క సినిమాకు కూడా కనీసం మంచి గ్రాఫిక్స్ లేక పోవడంతో త్వరలో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమాపై నెగటివ్ టాక్ మొదలు అయ్యింది.
ఆ మధ్య వచ్చిన ట్రైలర్ లోని గ్రాఫిక్స్ వర్క్ కు విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇదేం గ్రాఫిక్స్ వర్క్ అంటూ పెదవి విరవడంతో పాటు ఆమీర్ పేట్ బ్యాచ్ గ్రాఫిక్స్ వర్క్ అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఆమీర్ ఫేట్ లో మల్టీమీడియా నేర్చుకున్న వారు ప్రాక్టీస్ చేసినట్లుగా ఉంది గ్రాఫిక్స్ వర్క్ అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున నెగటివ్ టాక్ ప్రచారం జరిగింది. దాంతో సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానం మొదటి నుండే వ్యక్తం అవుతోంది. ఈ సినిమా లో నాగార్జున నటించడంతో పాటు రాజమౌళి సమర్పిస్తున్న కారణంగా అద్భుతం ఆవిష్కారం అవుతుందేమో అని కొందరు భావిస్తున్నారు.
కానీ రాజమౌళి మరియు నాగార్జున అభిమానులు మాత్రం బ్రహ్మాస్త్ర సినిమా వల్ల వీళ్ల పరువు గంగలో కలవనుందా అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి మరియు నాగార్జునలు కచ్చితంగా ఈ సినిమా తో సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం అటు ఇటు అయినా కూడా తెలుగు నెటిజన్స్ ఓ రేంజ్ లో ఏకి పారేస్తారు. రాజమౌళికి ఇది మొదటి ప్లాప్ అవ్వబోతుంది అంటూ ఇప్పటికే కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే నెలలో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.