Nagarjuna : టెన్షన్ లో నాగార్జున.. కార‌ణం అదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : టెన్షన్ లో నాగార్జున.. కార‌ణం అదేనా..?

 Authored By kranthi | The Telugu News | Updated on :2 December 2021,7:15 am

Nagarjuna :  టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు, అక్కినేని నాగార్జున కుటుంబానికి గత కొద్ది రోజులుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 60 సంవత్సరాల వయస్సు దాటినా నాగ్ ఓ వైపు వరుస సినిమాలతో, మరోవైపు బిగ్ బాస్ షోతో నిత్యం బిజీగా గడుపుతున్నారు. అయితే నాగ్ కు సినిమాల పరంగా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ దొరకడం లేదు. నాగ్ తో పాటు ఆయన పెద్ద కొడుకు నాగ చైతన్యకు అతని భార్య నుంచి విడాకుల రూపంలో చిక్కుల్లో పడ్డారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు పై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.నాగ్ నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా అనంతరం… ఆయన యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేదు.

దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటికి అనుగుణంగా దర్శకుడు చైతూ – కృతి పాత్రల నిడివిని కూడా పెంచి దీన్నో మల్టీస్టారర్ సినిమాగా రూపు దిద్దుతున్నారు. ఈ కారణంగా సినిమాకు ముందు అనుకున్న దాని కంటే అధిక బడ్జెట్ అవడంతో నాగ్ కంగారు పడుతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కరోనా కారణంగా జరిగిన నష్టంతో పాటు ఈ సినిమాకు ఇప్పటివరకు బడ్జెట్ 50 కోట్లకు చేరుకుందని సమాచారం. గత కొన్ని ఏళ్లుగా హిట్లు లేక సతమతమవుతున్న నాగ్… ప్రస్తుతం ఈ సినిమా అంత బడ్జెట్ ను తిరిగి రాబడుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

nagarjuna bangarraju movie latest updates

nagarjuna bangarraju movie latest updates

Nagarjuna : అంత బడ్జెట్ తిరిగి రాబట్టేనా..!

సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు అనే చిత్రానికి కల్యాణ్ కృష్ణనే దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది