Nagarjuna : సమంత పేరు తీయకముందే గటగటా నీళ్లు తాగేసిన నాగార్జున.. చైతూ ఏం చేశాడంటే..?
Nagarjuna : సంక్రాంతి బరిలో నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో మిడియం రేంజ్ బడ్జెట్ సినిమాలకు మంచి చాన్స్ దొరికింది. ఈ టైంలో సినిమా విడుదల చేస్తే మినిమం గ్యారెంటీ ఉంటుంది. పాన్ ఇండియా మూవీస్ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌తో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా పండుగ బరిలో నుంచి తప్పుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ పవన్‌ను ఒప్పించడంతో తన సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తీరా చూస్తే ఆర్ఆర్ఆర్ విడుదలను కూడా వాయిదా వేశారు. అయితే, ఈ సంక్రాంతికి అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు మూవీని 14వ తేదిన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
గతంలో సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఇందులో నాగ్ బంగార్రాజు క్యారెక్టర్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘బంగార్రాజు’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 14న బంగార్రాజు మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. పండుగకు పెద్ద సినిమాలు ఏవీ లైన్లో లేకపోవడంతో నాగార్జున బంగార్రాజు ఈసారి ఆడియెన్స్‌ను అలరించేందుకు వస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

nagarjuna drank water before samantha name was mentioned
Nagarjuna : నాగార్జున , చైతూ ముందే మజిలీ టాక్
బంగార్రాజు సినిమా పండుగకు విడుదల కానుండటంతో మూవీ టీం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ జెట్‌లో బంగార్రాజు బృందం ఇంటర్వ్యూ ఇచ్చింది. తండ్రి నాగార్జున, కొడుకు నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి ముగ్గరు ఇందులో పాల్గొన్నారు. స్టార్స్ పర్సనల్ లైఫ్ గురించి అడిగిన ఇంటర్వ్యూయర్ కృతిని.. చైతూ నటించిన సినిమాల్లో మీకు ఫేవరెట్ ఏది అని అడుగగా ‘మజిలీ’ అంటూ టక్కున సమాధానం ఇచ్చింది. కృతి మజిలీ మూవీ గురించి మాట్లాడుతుంటే చైతన్య ముఖంలో హావభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. నాగార్జున అయితే వెంటనె వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగేశాడు. వాస్తవానికి సామ్ గురించి చెప్పడానికి అక్కినేని ఫ్యామిలీ ఇష్టపడటం లేనట్టు తెలుస్తోంది.