Namrata : క్యూట్ లుక్ తో అద‌ర‌గొడుతున్న‌ న‌మ్ర‌త‌.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Namrata : క్యూట్ లుక్ తో అద‌ర‌గొడుతున్న‌ న‌మ్ర‌త‌..

Namrata : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బీ.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వంశీ సినిమాలో మ‌హేశ్ బాబు, న‌మ్ర‌త న‌టించి మెప్పించారు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. కొన్ని ఏళ్లుగా డేటింగ్ తో ఉంటూ ఆత‌ర్వాత పెద్ద‌ల స‌మ‌క్షంలో 2005లో ఒక్క‌ట‌య్యారు. విష‌యం ఏమిటంటే న‌మ్ర‌త మ‌హేశ్ బాబు కంటే మూడేళ్లు వ‌య‌సులో పెద్ద‌ది. వీరికి కొడుకు గౌత‌మ్ కృష్ణ‌, […]

 Authored By mallesh | The Telugu News | Updated on :30 April 2022,7:00 pm

Namrata : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బీ.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వంశీ సినిమాలో మ‌హేశ్ బాబు, న‌మ్ర‌త న‌టించి మెప్పించారు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. కొన్ని ఏళ్లుగా డేటింగ్ తో ఉంటూ ఆత‌ర్వాత పెద్ద‌ల స‌మ‌క్షంలో 2005లో ఒక్క‌ట‌య్యారు. విష‌యం ఏమిటంటే న‌మ్ర‌త మ‌హేశ్ బాబు కంటే మూడేళ్లు వ‌య‌సులో పెద్ద‌ది. వీరికి కొడుకు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార ఉన్నారు.

న‌మ్ర‌త మ‌హేశ్ బాబు సినిమాల‌కు సంబంధించి ప‌బ్లిసిటీ ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను చూసుకుంటుంది.అయితే ముంబైలో జ‌న్మించిన న‌మ్ర‌త‌ సినిమాల్లో రాకముందు మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 1993లో నమ్రత మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా ఎంపికైంది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. హిందీలో వాస్తవ్ సినిమాతో ఫామ్లోకి వచ్చారు. హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించారు. తెలుగులో వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Namrata Cute looks Girl

Namrata Cute looks viral

సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా ఈ మూవీలో న‌టించ‌డం విశేషం. ఆ త‌ర్వాత మహేష్ బాబు, పిల్లలతో కలిసి ఆ మధ్య ఓ యాడ్‌లో నటించింది. గతేడాది మహేష్ బాబు, నమ్రత ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కలిసి స్టిల్స్ ఇచ్చారు.న‌మ్ర‌త మ‌హేశ్ బాబు సినిమా వ్య‌వ‌హారాల‌గురించి చూస్తూనే సోష‌ల్ మీడియాలో కూడ‌డా ఆక్టీవ్ గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హేశ్ సినిమాల అప్డేట్స్, ఫ్యామిలీ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. కూతురు సితార‌, గౌత‌మ్ కృష్ణ ఫొటోస్ వీడియోస్ అభిమానుల‌తో పంచుకుంటుంది. ప్ర‌స్తుతం న‌మ్ర‌త ఓ ఫొటో పోస్ట చేయ‌గా వైర‌ల్ అవుతోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది