Namratha Shirodkar : “నిన్ను మిస్ అవుతున్నా” కంట్లో నీళ్ళతో మహేష్ భార్య నమ్రత పోస్ట్ — గుండె తరుక్కుపోయే మ్యాటర్..!
Namratha Shirodkar : నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబును పెళ్లి చేసుకోవడానికి ముందే తను హీరోయిన్. అగ్ర హీరోల సరసన ఆడిపాడింది ఈ మరాఠీ భామ. తనది మహారాష్ట్ర. అయినా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవితో కూడా అంజి సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వంశీ సినిమాలో మహేశ్ బాబు సరసన నటించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు.

namratha shirodkar reminds his father post viral
అయితే.. నమ్రత శిరోద్కర్ కు పెళ్లి తర్వాత ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దానికి కారణం మహేశ్ బాబు. అవును.. సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య అంటే మామూలుగా ఉండదు కదా. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరం అయింది. అయినా కూడా మహేశ్ ఆర్థిక వ్యవహారాలు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుంది. నమ్రత, మహేశ్ బాబుది ప్రేమ పెళ్లి అని తెలుసు కదా. పెళ్లి తర్వాత నమ్రత ఇంటి బాధ్యతలు చూసుకోవడం కోసం సినిమాలు మానేసింది. సోషల్ మీడియాలోనూ నమ్రత యాక్టివ్ గా ఉంటుంది.
Namratha Shirodkar : వ్యాపారవేత్తగా ఎదిగిన నమ్రత
ఇటీవల సోషల్ మీడియాలో నమ్రత తన తండ్రి ఫోటోను షేర్ చేసి.. తన తండ్రిని ఒకసారి గుర్తు చేసుకుంది. 16 సంవత్సరాలుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నా పప్పా. నీ ప్రతి మెమోరీ నా మదిలో అలాగే ఉండిపోయింది. ఏం మారలేదు.. త్వరగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావు పప్పా.. అంటూ నమ్రత ఎమోషనల్ అయింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రతా తండ్రి 16 ఏళ్ల కిందనే చనిపోయారు. అప్పటి నుంచి నమ్రత తన తండ్రిని తలుచుకొని బాధపడుతూనే ఉంది. తాజాగా తండ్రిని గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram